వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ కమల.
వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎఫ్ఆర్ఓ కమల.
వన్యప్రాణుల రక్షణ ప్రతి ఒక్కర బాధ్యత అని దుమ్ముగూడెం ఎఫ్ఆర్ఓ కమల అన్నారు. శుక్రవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్, అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ 2026 వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అడవులు,వన్యప్రాణులు జీవవైవిధ్యం పరిరక్షణపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.పోటీల్లో ప్రతిభ కనబరిచిన ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు అటవీ శాఖ అధికారుల చేతుల మీదుగా ప్రథమ,ద్వితీయ,తృతీయ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ కమల,డిప్యూటీ ఆర్‌వో సుజాత,ఎఫ్‌బీవో రహీం, కళాశాల ప్రిన్సిపల్ కృష్ణవేణి ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ మల్లెల శ్రీనివాసరావు,సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి సుమన్ దుమ్ముగూడెం