BREAKING
సంజూ ధనాధన్ 82, శ్రేయస్ మెరుపులు.. విండీస్‌ బౌలర్లను ఉతికేసిన టీమిండియా ఉచిత సంతాన సాఫల్య శిబిరానికి విశేష స్పందన ఆస్తి వివరాలు చెప్తేనే ప్రమోషన్ మేయర్ సీటు తో సహా 62 డివిజన్లు గెలుచుకుంటాం -- టిడిపి జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే బడేటి చంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కంటే ఎక్కువ సీట్లు ఇస్తామని ప్రకటించిన టిడిపి హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు విశ్వం సీబీఎస్ఈ పాఠశాలలో ఘనంగా స్పోర్ట్స్ మీట్ 2కే ఆగిరిపల్లి ఎస్‌డబ్ల్యూపీసీలో గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణ --తడి చెత్తతో వర్మీ కంపోస్ట్ తయారీపై అవగాహన ‘జైలర్-2’ చిత్రానికి ఏపీ ప్రభుత్వ వెసులుబాటు: టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ తెలంగాణలో కొత్త ఓటర్ల నమోదుకు భారీగా దరఖాస్తులు గద్వాల్ విజయలక్ష్మి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌కు హైకోర్టులో ఊరట ఘనంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపణలు.. ఎన్నికల కమిషనర్ రాజీనామాకు SFI డిమాండ్ ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలని భీమవరంలో నిరసన కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముఖ్యమంత్రి పర్యటన: వృద్ధుడి వద్దకు స్వయంగా వెళ్లి అర్జీ స్వీకరించిన జిల్లా ఎస్పీ పంకజ్ కుమార్ మీనా .

పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం

Select Suryaa Now
పర్చూరులో రూ.25.29 కోట్లతో అభివృద్ధి పనులు •మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరికి అడుగడుగునా ప్రజల నీరాజనం

ఇంకొల్లు:

పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు మరో ముందడుగు పడింది. మార్టూరు, ఇంకొల్లు మండలాల పరిధిలో సుమారు రూ.25.29 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రారంభించారు. మార్టూరు నుంచి ఇంకొల్లు వరకు మార్గమధ్యంలోని గ్రామాల్లో ప్రజలు రహదారులపైకి వచ్చి పూలవర్షం కురిపిస్తూ, ఘనస్వాగతం పలికారు. మంత్రి అనగాని, ఎమ్మెల్యే ఏలూరి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇసుకదర్శి, నాగండ్ల, పావులూరు, ఇంకొల్లు గ్రామాల్లో రహదారులు, సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జలధార పథకం పనులతో పాటు విలేజ్ హెల్త్ క్లినిక్‌లు, పంచాయతీ కాంప్లెక్స్‌లో నూతన గదులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. నాగండ్లలో 31 మంది, ఇంకొల్లు మండలంలోని గొనసపూడి, సూదివారిపాలెం గ్రామాలకు చెందిన 37 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.