వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు: డిఎంహెచ్ఓ డాక్టర్ స్వర్ణకుమారి
జిల్లాలో ఆరోగ్య సేవల మెరుగుదలకు వైద్య శాఖ దృష్టి కేంద్రీకృతమైంది. ఈ క్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. స్వర్ణకుమారి శనివారం ఆకస్మికంగా ఆరుట్ల, మాడ్గుల, ఇర్విన్, యాచారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను తనిఖీ చేశారు. OP, IP రిజిస్టర్లు, మందుల నిల్వలు, కోల్డ్ చైన్ నిర్వహణ, ల్యాబ్ సేవలు, సిబ్బంది హాజరు, పారిశుధ్య పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు.
అలాగే NCD, TB, ఇమ్యునైజేషన్ సేవల అమలుపై వివరాలు తెలుసుకుని, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ తనిఖీలలో హెల్త్ సూపర్‌వైజర్లు, సంబంధిత PHCల మెడికల్ ఆఫీసర్లు, ANMలు, ఆశా వర్కర్లు మరియు ఇతర ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్.