BREAKING
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అన్యాయాలపై పోరాటానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌: ఆవిష్కరించిన రాహుల్ గాంధీ శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి కరెంట్ సమస్యలకి గుడ్‌బై.. ఎమ్మెల్యే యాదయ్య హామీ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన ముంబైలో హోరెత్తుతున్న సీజేపీ ఆందోళన: సీఈసీ రాజీనామాకు డిమాండ్ అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం కోల్‌కతాలో బ్రెజిల్, భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీ గురుమూర్తి మదనపల్లె జెపి తైక్వాండో విద్యార్థులకు పతకాల పంట టాటా సన్స్ బోర్డులో వివాదం, చంద్రశేఖరన్ పునర్నియామక ఓటింగ్ సమావేశం వీడియో, మినిట్స్ కోరిన నోయెల్ టాటా శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి ఘటన, వైరల్ వీడియోలతో కలకలం, స్వయంగా కేసు నమోదు చేసిన పోలీసులు

ఉందానగర్ స్టేషన్ వద్ద చెత్త రాజ్యం..!

Select Suryaa Now
ఉందానగర్ స్టేషన్ వద్ద చెత్త రాజ్యం..!

రంగారెడ్డి జిల్లాలోని జీహెచ్ఎంసీ శంషాబాద్ 118వ డివిజన్ పరిధిలో ఉన్న ఉందానగర్ రైల్వే స్టేషన్ పరిసరాలు చెత్తతో నిండిపోవడంతో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. పారిశుధ్య నిర్వహణ పూర్తిగా లోపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రైల్వే స్టేషన్‌కు వెళ్లే మార్గం నుంచి ప్లాట్‌ఫాం పరిసరాల వరకు ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయి. వీటి నుంచి దుర్వాసన వెదజల్లుతుండటంతో పాటు దోమలు, ఈగలు విస్తరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
ప్రతిరోజూ వందలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే స్టేషన్ వద్ద ఇలాంటి అపరిశుభ్ర వాతావరణం నెలకొనడం ఆందోళనకరం. పారిశుధ్యం లోపంతో వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.
ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి పేరుకుపోయిన చెత్తను తొలగించి, శుభ్రత చర్యలు చేపట్టాలని, రోజువారీ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.

(శంషాబాద్ - మేజర్ న్యూస్)