BREAKING
బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం అన్యాయాలపై పోరాటానికి ‘సత్యాగ్రహ’ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌: ఆవిష్కరించిన రాహుల్ గాంధీ శ్రీసిటీ ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి శ్రీసిటీలో బాయిలర్ పేలుడు.. చంద్రబాబు దిగ్భ్రాంతి కరెంట్ సమస్యలకి గుడ్‌బై.. ఎమ్మెల్యే యాదయ్య హామీ ఇంటిగ్రేటెడ్ పాఠశాల ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ ఆందోళన ముంబైలో హోరెత్తుతున్న సీజేపీ ఆందోళన: సీఈసీ రాజీనామాకు డిమాండ్ అభివృద్ధే లక్ష్యంగా.. 21వ డివిజన్‌లో జనసేన ఇంటింటి ప్రచారం కోల్‌కతాలో బ్రెజిల్, భారత్ ఫుట్‌బాల్ మ్యాచ్ కోసం కట్టుదిట్టమైన భద్రత భద్రాచలం చేరుకోనున్న సేవా సంకల్ప యాత్ర శ్రీసిటీ పేలుడు ఘటనపై ఎంపీ దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి : ఎంపీ గురుమూర్తి మదనపల్లె జెపి తైక్వాండో విద్యార్థులకు పతకాల పంట టాటా సన్స్ బోర్డులో వివాదం, చంద్రశేఖరన్ పునర్నియామక ఓటింగ్ సమావేశం వీడియో, మినిట్స్ కోరిన నోయెల్ టాటా శ్రీసిటీలో ప్రమాదంపై సీఎం దిగ్భ్రాంతి గువాహటి నైట్‌క్లబ్‌లో మహిళపై దాడి ఘటన, వైరల్ వీడియోలతో కలకలం, స్వయంగా కేసు నమోదు చేసిన పోలీసులు

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ

Select Suryaa Now
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలపై గాంధీభవన్‌లో కాంగ్రెస్ కీలక భేటీ

హైదరాబాద్, సూర్య ప్రతినిధి : తెలంగాణలో ఖాళీగా ఉన్న గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీ ప్రక్రియ వేగవంతమైంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ నేడు ఆశావహులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు గాంధీభవన్‌లో ఈ భేటీ జరగనుంది.

ఈ స్థానాలను ఆశిస్తూ కాంగ్రెస్ పార్టీలోని పలువురు సీనియర్ నాయకులు, సమాజంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పోటీ పడుతున్నారు. ముఖ్యంగా టికెట్ ఆశిస్తున్న వారిలో గౌరి సతీష్, సత్తు మల్లేష్, అనిల్, చనగాని దయాకర్, బోరెడ్డి అయోధ్యరెడ్డి తదితరులు ప్రముఖంగా ఉన్నారు.

ఈ భేటీలో ఆశావహుల అభిప్రాయాలు, వారి సామాజిక సమీకరణాలు మరియు పార్టీకి వారు చేసిన సేవలను మహేష్‌గౌడ్‌ అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం అభ్యర్థుల పేర్లతో కూడిన నివేదికను సిద్ధం చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్ఠానానికి అందజేయనున్నారు. త్వరలోనే పార్టీ అధిష్ఠానం ఆమోదంతో అభ్యర్థుల తుది జాబితాను ఖరారు చేసి గవర్నర్‌కు సిఫార్సు చేయనున్నట్లు సమాచారం.