BREAKING
25 న మున్సిపల్ అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్షా సమావేశం 2028లో తెలంగాణలో బీసీలదే రాజ్యాధికారం: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఆత్మహత్యాయత్నం శ్రీశైలంలో అన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం శ్రీశైలంలో నందీశ్వర స్వామివారికి విశేష పూజలు శ్రీశైల క్షేత్ర పాలకుడికి విశేష పూజలు శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు పీఏసీఎస్‌ చౌటుప్పల వైస్‌ చైర్మన్‌గా శివారెడ్డి కత్రినా కైఫ్ ట్రోలింగ్‌పై పరిణీతి చోప్రా సీరియస్.. ప్రసనానంతర శరీర మార్పులపై అన్ ఎడ్యుకేటెడ్ కామెంట్స్ అంటూ ఆగ్రహం! ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్ష వినాయక మండపంలో పూజ.. రాజోలి వీరారెడ్డి రాణి ముఖర్జీ తల్లి కృష్ణ ముఖర్జీ కన్నుమూత.. నివాళులర్పించిన షారూఖ్, ఆలియా, కరణ్ జోహార్! పాక మల్లేష్ కు యాదవ సంఘం అభినందనలు పెన్నా కాలుష్యంపై బీజేపీ సమరశంఖం 24న వాసవి సర్కిల్ వద్ద ధర్నా — పాలెం రెడ్డి కిరణ్ పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధికి 20 కోట్లు సోషల్ హల్‌చల్: వామికా గబ్బీ విశ్వరూపం.. సారీలో మృణాల్ ఠాకూర్ మెరుపులు!

తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్

Select Suryaa Now
తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్

*తమ్ముడిని హత్య చేసిన అన్న అరెస్ట్*

*డబ్బుల విషయమే హత్యకు కారణం*

*24 గంటల్లోనే నిందితున్ని అరెస్టు చేసిన పోలీసులు*

*నేరానికి ఉపయోగించిన కత్తి,రక్తపు మరకలు ఉన్న దుస్తులు స్వాధీనం*

*వివరాలు వెల్లడించిన మామును ఏసిపి వెంకటేష్*

గీసుగొండ సెప్టెంబర్ 21 మేజర్ న్యూస్ (సూర్య)గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని గరీబ్‌నగర్ లో జరిగిన హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి,మృతుడి అన్నను అరెస్ట్ చేశారు.కేసుకు సంబంధించిన వివరాలను మామునూరు ఏసిపి వెంకటేష్ వెల్లడించారు.19వ తేదీన రాత్రి సుమారు 9.30 గంటలకు గరీబ్‌నగర్‌లోని ఒక అద్దె ఇంటిలో  ఎలుబాక ప్రసాద్ (31) కత్తిపోట్లకు గురై మృతి చెందాడు.మృతుడి ఛాతి,వీపు భుజం ప్రాంతాల్లో తీవ్ర కత్తిపోటు గాయాలు ఉన్నాయి.మృతుడి తల్లి ఎలుబాక సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు గీసుగొండ పోలీస్ స్టేషన్‌లో  హత్య నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశాం.దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం,నిందితుడు ఎలుబాక ప్రవీణ్ (33)తన తల్లి వద్ద తరచుగా డబ్బులు అడిగేవాడు ఈ విషయమై ప్రసాద్ నిందితుడిని దూషించడంతో ఇద్దరి మధ్య గతంలో పలుమార్లు గొడవలు జరిగాయి.ఈ నేపథ్యంలో మృతుడిపై నిందితుడు కక్ష,అసూయ పెంచుకుని,తన తల్లి సంపాదించే డబ్బు తనకే దక్కాలనే ఉద్దేశంతో తమ్ముడిని హత్య చేశాడు.19వ తేదీన రాత్రి నిందితుడు తను స్వతహాగా వెల్డర్ అయినందున తను తయారు చేసుకున్న కత్తిని వెంట తీసుకుని గరీబ్‌నగర్‌లోని తన తమ్ముడు,తల్లి ఉండే ఇంటికి వెళ్లాడు.ఆ సమయంలో ఆసుపత్రిలో నైట్ డ్యూటీలు నిర్వహించే తల్లి నైట్ డ్యూటీకి వెళ్లి ఉండగా,ప్రసాద్ ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు.నిందితుడు కావాలని తన తమ్ముడితో వాగ్వాదానికి దిగి గొడవ పెట్టుకుని వేసుకున్న పథకం ప్రకారం కత్తితో తన తమ్ముడు ప్రసాద్ వీపు,ఛాతి,భుజంపై పలుమార్లు పొడిచాడు.తీవ్ర రక్తస్రావంతో మృతుడు అక్కడికక్కడే కుప్పకూలాడు.ఈ  సంఘటనను గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు ఫోను చేయగా అంబులెన్స్ సిబ్బంది అక్కడికి వచ్చి పరిశీలించి అతను మరణించినట్లు నిర్ధారించారు. నిందితుడు తన తమ్ముడుపై దాడికి దిగే సమయంలో పెనుగులాటలో నిందితుడి ఎడమ బొటనవేలుకు కూడా గాయమై రక్తస్రావమైంది.

*తల్లిని కూడా బెదిరించిన నిందితుడు*

దాడి అనంతరం నిందితుడు తన నివాసం ఉంటున్న కీర్తినగర్ లోని ఇంటికి వెళ్లి జరిగిన విషయం తన భార్యకు చెప్పి తిరిగి తన తల్లి ఇంటికి వచ్చాడు. అక్కడ మరణించిన అతని తమ్ముడి వద్ద తన తల్లి ఏడుస్తుండటం గమనించి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడిస్తే నిన్ను కూడా చంపుతాను.తమ్ముడిని చంపింది నేనే అంటూ బెదిరించాడు.

*ఆర్.ఎం.పి డాక్టర్ వద్ద చికిత్స*

నిందితుడు తన ఎడమ బొటనవేలు గాయానికి 20వ తేదీన తెల్లవారుజామున గీసుగొండలోని ఆర్.ఎం.పి డాక్టర్‌ను సంప్రదించాడు. డాక్టర్ ఆగాయాల గురించి వివరిన కోరగా తన తమ్ముడిని కత్తితో పొడవగా తన చేతికి గాయమైనట్టుగా డాక్టర్ కు  తెలిపాడు.డాక్టర్ ప్రాథమిక చికిత్స చేసి, పోలీసుల ముందు లొంగిపోవాలని సూచించాడు.

*నిందితుడి అరెస్ట్ మరియు కీలక ఆధారాల స్వాధీనం*

21వ తేదీన నిందితుడు తన ఇంటి వైపు వస్తున్నాడనే విశ్వసనీయ సమాచారం అందడంతో గీసుగొండ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారించారు.నిందితుడు నేరం అంగీకరించి తమ్ముని చంపడానికి ఉపయోగించిన కత్తి,ఆ సమయంలో వేసుకున్న దుస్తుల సమాచారం ఇవ్వగా ఆ సమాచారం మేరకు అతని ఇంటి సమీపంలోని పొదల్లో దాచిన  వస్తువులను స్వాధీనం చేసుకున్నాం.
ఈస్ట్ జోన్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ క్లూస్ టీమ్ సహాయంతో సంఘటనా స్థలంలో శాస్త్రీయ ఆధారాలను సేకరించి స్వాధీనం చేసుకున్న వస్తువులపై అవసరమైన ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాం.అరెస్ట్ చేసిన నిందితుడు ఎలుబాక ప్రవీణ్ (33) ను రిమాండ్ చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచినట్లు తెలిపారు.ఈ హత్య కేసును 24 గంటల్లో చేదించి నేరస్థున్ని అరెస్ట్ చేసిన గీసుగొండ సీఐ విశ్వేశ్వర్,ఎస్.ఐ లు అనిల్ కుమార్,కుమార్,కానిస్టేబుల్ లు అరవింద్, విజయ్, ప్రవీణ్, భాస్కర్ రజినీ కుమార్ ను ఏసిపి అభినందించారు.