BREAKING
బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు

సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఆహ్వానం

Select Suryaa Now
సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి ఆహ్వానం

 భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని కోరుతూ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను అన్నపురెడ్డిపల్లి శివాలయ పునర్నిర్మాణ వ్యవస్థాపకుడు, హరిహర ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మారగాని శ్రీనివాస్ రావు కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అక్టోబర్  4వ తేదీ హైదరాబాదులోని రవీంద్ర భారతి లో ఆదివారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను మహేష్ కుమార్ గౌడ్‌కు అందజేశారు.ప్రతి ఏటా హరిహర ఫౌండేషన్ ఆధ్వర్యంలో భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు మారగాని శ్రీనివాస్ రావు తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని దర్శించుకుని స్వామివారి ఆశీస్సులు పొందేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవం తెలుగు రాష్ట్రాల ప్రజల ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తుందని ఆయన అన్నారు. ప్రతి ఏటా ఈ మహోత్సవాన్ని మరింత ఘనంగా నిర్వహించేందుకు హరిహర ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు.మహేష్ కుమార్ గౌడ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు, నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.