సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి......
మద్దూర్..సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మద్దూర్ ఎస్సై ఎండి ఆసిఫ్ అన్నారు. శనివారం రాత్రి మద్దూరు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామంలో పోలీస్ కళాజాత బృందం చే కనివిప్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని మానవ తప్పిదం వల్లే సైబర్ నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. బ్యాంకు అధికారులను చెప్పి ఫోన్ చేసిన వారికి అకౌంట్ డీటెయిల్స్ ఎవరికి షేర్ చేయకూడదని సూచించారు. ఏదైనా సైబర్ నేరం జరిగితే 1930 నెంబర్ కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. యువత బెట్టింగ్ లకు ఆన్లైన్ గేమ్ లకు అలవాటు పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రమాదాల నివారణకు సహకరించాలన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు బాధ్యతలు నేర్పించాలని ప్రజలు మూఢనమ్మకాలను వీడాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఇట్టబోయిన కనక చంద్రం, ఉప సర్పంచ్ గొడుగు బాలరాజు, పోలీస్ కళాబృందం సభ్యులు బాలు, రాజు, తిరుమల, అశోక్, సాంస్కృతిక సారధి గజ్వేల్ టీం లీడర్ శ్యామ్, పుల్లూరు యాదగిరి, కవి గాయకులు పిన్నింటి రత్నం, పన్నీర్ శ్రీనివాస్, హరి ప్రసాద్, సిద్ధులు, బిక్షపతి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.