BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

సద్దుల బతుకమ్మ వేడుకల్లో సేవా స్ఫూర్తి చాటిన మంథని జగన్మోహన్‌రావు

Select Suryaa Now
సద్దుల బతుకమ్మ వేడుకల్లో సేవా స్ఫూర్తి చాటిన మంథని జగన్మోహన్‌రావు

 సూర్య, నస్పూర్‌ : సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మంథని జగన్మోహన్‌రావు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌ 6వ డివిజన్‌ కార్పొరేటర్‌ వనపర్తి కేత రాజేష్‌ ఆధ్వర్యంలో మహిళలకు ప్రసాదం పంపిణీ చేయడంతో పాటు మాలధారణ స్వాములకు అల్పాహారం ఏర్పాటు చేశారు. పండుగ వేళ మహిళలు, భక్తులకు సేవలందిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భాగస్వాములయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హిమ్మత్‌నగర్‌ దుర్గామాత కమిటీ సభ్యులు మంథని జగన్మోహన్‌రావును అభినందించి కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని వారు అన్నారు.