BREAKING
ఒక్క క్లిక్‌తో ఖాతా ఖాళీ.. తస్మాత్ జాగ్రత్త! తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి టాటా ఎల్సి రవాణా విభాగం జోరుతో రాణించిన ఆదాయం, లాభాల్లో వృద్ధి! మాజీ మంత్రి బొత్స నిజాలు మాట్లాడాలి... మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చైనా మందగమనంతో లగ్జరీ రంగానికి భారీ దెబ్బ ఏళ్ళ నాటి చెట్టును అక్రమంగా తొలగించారు సైబర్దాడిపై ఆహోల్డ్ డెల్హైజ్ స్పష్టత...కస్టమర్ల డేటా చోరీకి ఆధారాలు లేవని వెల్లడి! ఆరుగోశాలకు శంకుస్థాపన చేసిన ఏఎంసీ ఉపాధ్యక్షులు" దాసరి" సీతమ్స్ లో హ్యాక్ స్పియర్ హ్యాకథాన్ ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ 'ఈఎన్ఈ రిపీట్'.. నలుగురి గ్యాంగ్ కొత్త పోస్టర్ వైరల్! మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య పురపాలక సంఘం ఎన్నికలకు ఏర్పాట్లు రైతుబజార్ లో 'ధరణి' నాణ్యమైన బియ్యం కేంద్రం ప్రారంభించిన కూటమి నేతలు విద్యుత్ శాఖ పనితీరుపై అభిప్రాయం తెలియజేయండి తయారీ వ్యూహాలను వేగంగా మారుస్తున్న చైనా ఆటోమొబైల్ దిగ్గజాలు!

సదాశివనగర్ మండలంలో ఆహార భద్రతా అధికారి ఆకస్మిక తనిఖీలు

Select Suryaa Now
సదాశివనగర్ మండలంలో ఆహార భద్రతా అధికారి ఆకస్మిక తనిఖీలు
సూర్య సదాశివనగర్ :  కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలో ఆహార భద్రతా అధికారి జి. విక్రమ్ మంగళవారం పలు చిల్లర దుకాణాలు, రెస్టారెంట్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో కొన్ని దుకాణాల్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులను గుర్తించి, వాటిని వెంటనే తొలగించి పారవేయించారు. నాణ్యతపై అనుమానం ఉన్న పలు ఆహార పదార్థాల నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ప్రయోగశాలకు పంపించారు. అలాగే, ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం అవసరమైన ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ  లైసెన్స్ లేదా నమోదు లేకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్న పలు సంస్థలను గుర్తించి, సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆహార భద్రతా అధికారి మాట్లాడుతూ, జిల్లాలోని ప్రతి ఆహార వ్యాపారి తప్పనిసరిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ లేదా నమోదు కలిగి ఉండాలని సూచించారు. ఆహార పదార్థాల నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యం ఆహార భద్రతా శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.