విద్యుత్ శాఖ పనితీరుపై అభిప్రాయం తెలియజేయండి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం
విద్యుత్ శాఖ నుంచి ఐవీఆర్ఎస్ ద్వారా వచ్చే అభిప్రాయ సేకరణ ఫోన్ కాల్స్‌కు వినియోగదారులు స్పందించి, మండపేట విద్యుత్ శాఖ సిబ్బందికి ప్రోత్సాహం అందించాలని మండపేట ట్రాన్స్‌కో సహాయ ఇంజినీర్ ఎం.ముని విజ్ఞప్తి చేశారు. ఇటీవల సంభవించిన తుపాను సమయంలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖ సిబ్బంది ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఎంతో శ్రమించి విధులు నిర్వహించారని తెలిపారు. ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు కలగకుండా సిబ్బంది చేసిన కృషిని గుర్తించి, ఐవీఆర్ఎస్ ద్వారా ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు తమ అనుభవానికి అనుగుణంగా అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. వినియోగదారుల స్పందన సిబ్బందికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు. మండపేట విద్యుత్ సెక్షన్ సిబ్బందికి, ఏపీఈపీడీసీఎల్‌కు వినియోగదారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.