BREAKING
చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్! కేఎండీఎస్ ట్యాంక్ తయారీ సంస్థలో జర్మనీ ప్రభుత్వం భారీ వాటా కొనుగోలు దిశగా చర్చలు నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం. మరోసారి లాయర్‌గా కీర్తి సురేష్.. ‘సత్యవాన్ సావిత్రి’ అఫీషియల్ టీజర్ రిలీజ్! కొమ్ము గోపాల్‌రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి మంచిర్యాలలో నలుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్ డబల్ ఇంజిన్ సర్కార్ తో రాష్ట్రం మరింత అభివృద్ధి : ఎమ్మెల్యే బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ ట్రెడిషనల్ లుక్.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్! పొన్నూరులో స్నేహ మ్యాక్స్ బాధితుల ఆవేదన - రూ.36 కోట్ల డిపాజిట్లు తిరిగి ఇవ్వాలని డిమాండ్ టెక్ కంపెనీ బెండింగ్ స్పూన్స్‌లో 4 శాతానికి పెరిగిన వాటా రామాయణం ట్రైలర్ 2 లాంచ్ ఈవెంట్.. బెంగళూరులో రణ్‌బీర్ కపూర్, యశ్ సందడి! ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి

ఉపాధి హామీ మేట్లకు ఒకరోజు శిక్షణ

Select Suryaa Now
ఉపాధి హామీ మేట్లకు ఒకరోజు శిక్షణ
సూర్య,భీమ్‌గల్: భీమ్‌గల్ మండల పరిషత్ కార్యాలయంలో వీబీ - జీ రామ్ జీ పథకానికి సంబంధించి నూతనంగా ఎంపికైన మేట్లకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మేట్ల బాధ్యతలు, విధులపై అవగాహన కల్పించారు.ప్రతి 40 మంది కూలీలకు ఒక మేటును నియమిస్తారని, వారు కూలీల హాజరు నమోదు, పనుల కొలతలు, మస్టర్ల నిర్వహణ, ఉపాధి హామీ పనుల కోసం కూలీల నుంచి డిమాండ్ సేకరణ, జాబ్ కార్డుల నిర్వహణ తదితర విధులు చేపట్టాలని శిక్షణలో వివరించారు.ఈ సందర్భంగా ఎంపీడీవో సంతోష్ కుమార్ మాట్లాడుతూ మేట్లు కూలీలకు పనులు కల్పించడంతోపాటు పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని సూచించారు. కూలీల సమీకరణలో చురుకుగా పాల్గొని, ఎక్కువ మంది కూలీలు ఉపాధి పనులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండలంలోని 27 గ్రామాలకు చెందిన నూతనంగా ఎంపికైన మేట్లతోపాటు ఏపీవో జి. నర్సయ్య, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ పూర్ణచంద్, టెక్నికల్ అసిస్టెంట్లు గణేష్, రమేష్, స్వామిదాస్ పాల్గొన్నారు.