గురువందనం అవార్డు పొందిన కూరేళ్ళి శ్రీనివాసరెడ్డి .
కుకునూరుపల్లి, ....జీతెలుగు ఆధ్వర్యంలో గురు వందనం 2026 కార్యక్రమంలో భాగంగా కుకునూరుపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న కూరెళ్ళి శ్రీనివాస్ రెడ్డి గురువందనం అవార్డు వరించింది. మంగళవారం హైదరాబాదులోని తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్లో, కూరేళ్ళి శ్రీనివాస్ రెడ్డి కి గురు వందనం అవార్డు ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఈటల రాజేందర్ కే.కేశవరావు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందజేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు అధ్యక్షులు పులగం దామోదర్ రెడ్డి పిఆర్టియు అధికార ప్రతినిధి మహేందర్ రెడ్డి జిల్లా అధ్యక్షులు మల్లుగారి ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు.