telanagana
చేయూత పింఛన్లపై డీపీఓ క్షేత్రస్థాయి పరిశీలన
సూర్య, చింతలమానేపల్లి : కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో మంగళవారం డీపీఓ బిక్షపతి గౌడ్ సంబంధిత చేయూత పింఛన్లను పరిశీలించారు. బాబాసాగర్, రుద్రాపూర్, బాలాజీ అంకోడ, రవీంద్రనగర్, రణవెల్లి, బూరెపల్లి గ్రామ పంచాయతీల్లో పింఛన్ల వెరిఫికేషన్ చేపట్టారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణ, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.