BREAKING
కలెక్టర్, ఎస్ పి లను18వ అయ్యప్ప పడి పూజకు ఆహ్వానించిన గురుస్వాములు డిగ్రీ విద్యార్థినులకు ఎస్పీ కె. చక్రవర్తి షూస్ బహూకరణ పెళ్లి వేడుక సందడితో తఖబ్బలల్లా పాట.. 40 డేస్ ఆఫ్ హౌస్ పార్టీ నుంచి రెండో గీతం విడుదల గోవాలో అట్టహాసంగా ముగిసిన 57వ ఇఫీ వేడుకలు.. ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి, అవార్డుల విజేతలు వీరే వృషకర్మలో ఊహించని ట్విస్ట్.. మీనాక్షి చౌదరి పాత్రపై దర్శకుడు కార్తీక్ దండు ఆసక్తికర హింట్ యే ప్రేమ్ మోల్ లియాలో అనుపమ్ ఖేర్ నటనకు కన్నీళ్లు పెట్టుకున్న మహేశ్ భట్.. భావోద్వేగ లేఖ ఏడవకపోతే రూ. కోటి.. ఏడిస్తే రూ. లక్ష.. అల్లు అరవింద్‌తో ఖరీదైన బెట్ ఓడిపోయిన సుకుమార్ వృషకర్మ వర్సెస్ అలియాస్ రుక్మిణి.. డిసెంబర్ 4 బాక్సాఫీస్ పోరులో గెలిచేదెవరు వేములవాడలో ఆధునిక పోస్టాఫీస్ భవన నిర్మాణానికి కృషి చేస్తా - బండి సంజయ్ కుమార్ హామీ దొడగట్ట సర్పంచ్ రామాంజినేయులు కు ఘనంగా సన్మానం.. అలియాస్ రుక్మిణిపై నాని సంచలన వ్యాఖ్యలు.. అలా అనిపించకపోతే సినిమాలు మానేస్తా పసిడి ప్రియులకు ఊరట.. స్థిరంగా బంగారం, వెండి ధరలు.. నేడు తులం రేటు ఎంతంటే బిగ్ బాస్ తెలుగు 10 నుంచి టెంపర్ వంశీ ఎలిమినేషన్.. 12 వారాలకు రెమ్యునరేషన్ ఎంతంటే డిసెంబర్ 1న వికారాబాద్‌కు తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా రాక అచ్చంపేట ఎస్సీ రిజర్వేషన్ మరో 25 ఏళ్లు కొనసాగించాలి

తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి

Select Suryaa Now
తడికలపూడి మానవత సేవలు ఆదర్శనీయం  - సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి

కామవరపుకోట, సూర్య న్యూస్‌ : మండలంలోని తడికలపూడి మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు ఆదర్శనీయం అని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు ఎన్‌. రామచంద్రారెడ్డి అన్నారు. 8 సంవత్సరాల తర్వాత రామచంద్రారెడ్డి మంగళవారం తడికలపూడి మానవత సంస్థ యూనిట్‌ను సందర్శించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సంస్థ ఫ్రీజర్లు, కైలాసరథం భద్రపరుచుకునే భవనం, కైలాసరథాన్ని రామచంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం మానవత స్టేట్‌ కన్వీనర్‌ మారుబోయిన కోటేశ్వరరావు, సెంట్రల్‌ కమిటీ చైర్మన్‌ కండెపు సూర్యనారాయణ, మానవత జిల్లా అధ్యక్షులు వి. చంద్రయ్య తదితరులు రామచంద్రారెడ్డితో కలిసి మానవత భవనం చుట్టూ మొక్కలు నాటారు. అనంతరం కైలాస రథం దాత సూర్య మోటార్స్‌ అధినేత చామర్తి కృష్ణారావు, మార్చురీ ప్రీజర్‌ అందజేసిన పారేపల్లి పుల్లాచారీ, భవన నిర్మాణానికి సహకరించిన దాతలు కోరుకొండ రాంబాబు బ్రదర్స్‌, మొట్టికాయల నాగేశ్వరరావు, మట్టే కుటుంబ సభ్యులను రామచంద్రారెడ్డి అభినందించి సత్కరించారు. అనంతరం తడికలపూడి మానవత శాఖ పూర్వ అధ్యక్షులు వి. పార్వతీ శంకర్‌ అనారోగ్యంతో ఉండడంతో వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తడికలపూడి శాఖ అధ్యక్షులు మిర్యాల చంద్రశేఖర్‌, ఛైర్మన్‌ కరుటూరి గంగాధర ప్రసాద్‌, ముళ్లపూడి వెంకటేశ్వరరావు, మలకలపల్లి రాఘవయ్య, గుడపాటి శ్రీనివాసరావు, కమ్మ శ్రీనివాసరావు, కొనకళ్ల కృష్ణారావు, మాదు గంగాధరరావు, పెరవలి శ్రీను, మానవత సభ్యులు పాల్గొన్నారు.

 రిపోర్టర్ :వుయ్యూరు శుభాష్‌, కామ‌వ‌ర‌పుకోట, ఏలూరు జిల్లా