BREAKING
మున్సిపల్ ఇండోర్ స్టేడియం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే దుర్గాదేవి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం మధుర మీనాక్షి అలంకారంలో చౌడేశ్వరి దేవి! సింగిల్ కట్ లేకుండా రణబాలి సెన్సార్ పూర్తి.. రన్ టైమ్ అఫీషియల్ ఖరారు చీపురుపల్లి రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ కేంద్రం పరిశీలన ప్రత్యేక పూజలో పాల్గొన్న ఉప్పల్ ఎమ్మెల్యే జెండర్ రిసోర్స్ సెంటర్ ప్రారంభం రూ.500 కోట్ల క్లబ్‌కు చేరువలో దృశ్యం 3.. మోహన్‌లాల్ ప్రశంసలతో అజయ్ దేవగణ్ రికార్డులు డి బీర్స్ డైమండ్స్‌లో వజ్రాల రాజధాని బోట్స్వానా వాటా పెంపు పార్వతీ దేవి అలంకారంలో బోయకొండ గంగమ్మ! లావేరు రోడ్డు దుకాణాల్లో చోరీ... కిరాణా షాపులో రూ.50 వేలు గల్లంతు ప్రభుత్వ బాండ్ ఈల్డ్‌ల పెరుగుదలతో అభద్రతలో అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు భూ సమస్యల పై కలెక్టర్ సానుకూల స్పందన నటులను డేట్ చేయనన్న శోభిత.. చైతూతో పెళ్లి తర్వాత ఆలోచన ఎందుకు మారిందంటే?

మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య

Select Suryaa Now
మండపేటలో పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరం;మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రిజర్వేషన్‌పై గత రెండు రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్‌పర్సన్‌ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ జాబితాలో మండపేట చైర్‌పర్సన్‌ స్థానాన్ని అన్‌రిజర్వ్‌డ్‌ కేటగిరీలో చేర్చడంతో పట్టణ రాజకీయాల్లో చర్చ మొదలైంది. దీంతో పోటీకి ఆసక్తి చూపుతున్న ఆశావహులకు అవకాశం ఏర్పడింది. అన్‌రిజర్వ్‌డ్‌ స్థానం కావడంతో కులం, లింగంతో సంబంధం లేకుండా అభ్యర్థులు ఎవరైనా పోటీ చేయవచ్చు. ఇదిలా ఉండగా, ఈసారి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రత్యక్ష విధానంలో జరగనుండటం ఎన్నికల సమీకరణాలను మార్చనుంది. 

గతంలో కౌన్సిలర్లుగా ఎన్నికైన వారిలో మెజారిటీ మద్దతు పొందిన అభ్యర్థి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యేవారు. ప్రత్యక్ష విధానంలో ఓటర్లు వార్డు సభ్యుడితో పాటు చైర్‌పర్సన్‌ అభ్యర్థిని కూడా నేరుగా ఎన్నుకుంటారు. దీంతో చైర్‌పర్సన్‌ పదవిని ఆశించే వ్యక్తులు తప్పనిసరిగా కౌన్సిలర్‌గా పోటీ చేయాల్సిన అవసరం ఉండదు. పట్టణ వ్యాప్తంగా ఓటర్ల మద్దతు పొందడం కీలకంగా మారుతుంది. ఈ నేపథ్యంలో మండపేటలో రాజకీయ పోటీ ఆసక్తికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే పలువురు ఆశావహులు పార్టీ టికెట్‌ కోసం ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అయితే పార్టీ నాయకత్వాలు ఎవరికి అవకాశం కల్పిస్తాయి, ఆశావహుల్లో ఎవరు చివరి వరకు బరిలో నిలుస్తారు అన్నది వేచి చూడాలి. రిజర్వేషన్‌ ఖరారుతో పాటు ప్రత్యక్ష ఎన్నికల విధానం అమల్లోకి రానుండటంతో రానున్న రోజుల్లో మండపేట మున్సిపల్‌ రాజకీయాలు మరింత వేడెక్కే అవకాశముంది