*ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ఉపాధ్యక్షుడిగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాస్*
మధిర, సూర్య మేజర్ న్యూస్.
ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ఉపాధ్యక్షుడిగా పసుపులేటి శ్రీనివాస్ సోమవారం బాధ్యతలు చేపట్టారు.
40 సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ, అందరివాడిగా, అభిమాన నాయకుడిగా ప్రజల మన్ననలు పొందుతున్న పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ప్రజా సేవకే అంకితమయ్యారు. ప్రైవేటు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూనే, ప్రజలకు దగ్గరవుతూ అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారు.సీనియర్ జర్నలిస్టుగా ప్రజాపాలన జాతీయ తెలుగు దినపత్రిక మరియు ప్రైమ్ నైన్ విలేకరిగా, మధిర చిరు వ్యాపారస్తుల సంఘ అధ్యక్షుడు, మండల మాజీ మున్నూరు కాపు ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. ఈ సందర్భంగా పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ను పలువురు అభినందనలు, తెలిపారు.
సుంకర…. సీతారాం
మధిర, ఆర్సీ