ఏళ్ళ నాటి చెట్టును అక్రమంగా తొలగించారు
శృంగవరపుకోట, సూర్య : శృంగవరపుకోట ఆర్.టీ.సీ. కాంప్లైక్స్ అవుట్ గేట్, జాతీయ రహదారి 516 బి పక్కన రైట్ ఆఫ్ వే (ఆర్.వో.ఆర్) పరిధిలో గల ఏళ్ళ నాటి సిరిపుడు చెట్టును అక్రమంగా తొలగించారు. కాలుష్య నివారణకు, పర్యావరణ పరిరక్షణకు విస్తృతంగా చెట్లను పెంచడముతో పాటు ఉన్న చెట్లను కాపాడుకోవలసిన తరుణంలో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా అక్రమంగా చెట్లను తొలగించడం శోచనీయమని పర్యావరణవేత్త, న్యాయవాది బొబ్బిలి రామకృష్ణ అన్నారు. చెట్టు తొలగింపుకు కారకులైనవారు ఏ స్థాయి వారైనా విచారించి, వాల్టా చట్టం ప్రకారం శిక్షించాలని, జరిమానాలు విధించాలని యన్.హెఛ్.ఏ., రెవెన్యూ శాఖాధికారులను రామకృష్ణ కోరారు.