సాయి ఎక్సలెంట్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
సాయి ఎక్సలెంట్ పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలు
జూలూరుపాడు కేంద్రంలోని సాయి ఎక్సలెంట్ పాఠశాలలో శుక్రవారం ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా విద్యార్థులు సాంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.బతుకమ్మ పాటలు పాడుతూ,సంప్రదాయ నృత్యాలతో సందడి చేయడంతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఆరెబోయిన కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను విద్యార్థులకు పరిచయం చేస్తూ పాఠశాలలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.ఇలాంటి కార్యక్రమాలతో చిన్నారులకు మన సంస్కృతి,సంప్రదాయాలపై అవగాహన పెరుగుతుందని పేర్కొన్నారు.విద్యతోపాటు ఆటపాటలు,సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు కరస్పాండెంట్ తెలిపారు.ఆహ్లాదకరమైన వాతావరణంలో డిజిటల్ తరగతుల ద్వారా బోధన అందిస్తున్నామని,నవోదయ,గురుకుల,సైనిక్,ఏకలవ్య పాఠశాలల ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని వివరించారు.గతంలోనూ తమ పాఠశాలలో శిక్షణ పొందిన పలువురు విద్యార్థులు పోటీ పరీక్షల్లో అర్హత సాధించి సీట్లు పొందారని కృష్ణ ప్రసాద్ తెలిపారు.అనంతరం విద్యార్థులు, ఉపాధ్యాయులు పరస్పరం స్వీట్లు పంచుకొని బతుకమ్మ సంబరాలను ఆనందోత్సాహాల మధ్య ముగించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఆరెబోయిన నాగలక్ష్మి,ప్రిన్సిపాల్ ప్రశాంతి,ఉపాధ్యాయులు నభీన,సత్యవతి,ఉదయభాను,భార్గవి,కళ్యాణి,అరుణ,స్వాతి,కృష్ణవేణి,శిరీష,రిచిత,యామిని,రజిత,జమున,మమత,సునీత,పల్లవి పాల్గొన్నారు.
సూర్య ప్రతినిధి సిద్ధిక్ జూలూరుపాడు