telanagana
రూ.6 లక్షల నోట్లతో అమ్మవారి అలంకరణ లక్ష్మీదేవి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గామాత
సిద్దిపేట అర్బన్, :దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల మధిర బట్టి రామన్నపల్లి గ్రామంలో దుర్గామాత అమ్మవారు లక్ష్మీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. గ్రామ యువత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి అమ్మవారిని సుమారు రూ.6 లక్షల విలువైన వివిధ నోట్లతో సుందరంగా అలంకరించారు.లక్ష్మీదేవి అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పూజలు సమర్పించారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి వివిధ రూపాల్లో అలంకరణలు చేపడుతూ భక్తిభావంతో వేడుకలను నిర్వహిస్తున్నారు.