రెండవ రోజు సంగారెడ్డిలో దీక్ష కొనసాగించిన జగ్గారెడ్డి, నిర్మల
*రెండవ రోజు సంగారెడ్డిలో దీక్ష కొనసాగించిన జగ్గారెడ్డి, నిర్మల*
-*కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా బుధవారం దీక్ష చేపట్టిన జగ్గారెడ్డి దంపతులు*
-*రాహుల్ కు మద్దతుగా రాత్రింబవళ్లు దీక్ష వేదికపైనే నిరసన తెలిపిన జగ్గారెడ్డి, నిర్మల*
*తమ అగ్రనేత ఉద్యమం చేసినన్నాళ్లు తమ పోరాటం కూడా కొనసాగుతుందని వెల్లడి*
*జగ్గారెడ్డి దంపతుల దీక్షకు మద్దతుగా తరలివచ్చిన ప్రజా సంఘాలు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, సంగారెడ్డి ప్రజలు*
*సంఘీభావం తెలిపిన పొదెం వీరయ్య, ధర్మపురి సంజయ్, సంగారెడ్డి డిసిసి అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి
సంగారెడ్డి ; కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మద్దతుగా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి చేపట్టిన దీక్ష రెండో రోజూ కొనసాగింది. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు రైతులు, వివిధ సంఘాల నాయకులు దీక్షా శిబిరానికి తరలివచ్చి సంఘీభావం తెలిపారు.భద్రాచలం మాజీ ఎమ్మెల్యే పొదెం వీరయ్య, నిజామాబాద్ మాజీ మేయర్ ధర్మపురి సంజయ్, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి దీక్షా శిబిరాన్ని సందర్శించి జగ్గారెడ్డి దంపతులకు మద్దతు పలికారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల ఓటు హక్కును కాపాడేందుకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయన పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ రాహుల్ గాంధీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సంగారెడ్డి నియోజకవర్గంలో రానున్న రోజుల్లోనూ సంఘీభావ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, జగ్గారెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.