BREAKING
90ల నాటి జ్ఞాపకాలతో హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్! హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు! వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలి సీపీఎం జిల్లా కార్యదర్శి వై. సింహారావు డిమాండ్ వెల్దుర్తి మండల ఎంపీటీసీ, వార్డు రిజర్వేషన్లపై ఎమ్మార్పీఎస్ తీవ్ర అభ్యంతరం సందీప్ కిషన్ ‘కరికాల’ మూవీలోకి గాయత్రి భరద్వాజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో క్రేజీ రోల్!

రైతుల కష్టాలు రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? -తిమ్మాజిపేటలో రైతుల మహాధర్నాకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మద్దతు

Select Suryaa Now
రైతుల కష్టాలు రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా? -తిమ్మాజిపేటలో రైతుల మహాధర్నాకు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మద్దతు

ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపడంలో విఫలమవుతుంద న మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. తిమ్మాజిపేట మండలం కేంద్రంలో  24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాధర్నాలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా  మర్రి మాట్లాడుతూ ఒకవైపు రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని చెబుతూ, మరోవైపు విద్యుత్ సమస్యలతో రైతులు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలకు, క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. రైతులు అప్పులు చేసి, పెట్టుబడులు పెట్టి, విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి పంటలు సాగు చేస్తున్నారనీ , పంటలకు నీరు అందించాల్సిన కీలక సమయంలో విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం  ఉందన్నారు.  కేసీఆర్ నాయకత్వంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా విధానాన్ని అమలు చేశామని  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు నిరంతర విద్యుత్ అందించాల్సిన బాధ్యత నుంచి తప్పించుకోలేదని స్పష్టం చేశారు.
పి. వినయ్ కుమార్  నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్