BREAKING
కాత్యాయని అలంకరణలో కనకదుర్గ అమ్మవారు. సంగారెడ్డి పట్టణ టీఎన్జీవోస్ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక నాటో యుద్ధ నౌకలకు సేవలందిస్తున్న కంపెనీలో భారీ లంచగొండితనం 90ల నాటి జ్ఞాపకాలతో హాలీవుడ్ యాక్షన్ చిత్రం ‘స్ట్రీట్ ఫైటర్’.. అక్టోబర్ 16న గ్రాండ్ రిలీజ్! హార్ముజ్ జలసంధిలో ఎరువుల సరఫరా ప్రణాళిక అమలు కాకపోతే ప్రపంచ ఆహార సంక్షోభం లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బ్లాక్‌బస్టర్ సక్సెస్.. ఓటీటీలో రికార్డుల మోత మోగిస్తున్న హర్ష చెముడు వెబ్ సిరీస్! సెప్టెంబర్‌లో పెరిగిన అమెరికా వినియోగదారుల ధరల సూచీ నగరంలో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయం ప్రారంభం వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు గోపీచంద్ ‘భరతవర్ష’ నుంచి నవదుర్గల వైభవంగా ‘అమ్మ కదిలి వచ్చె’ సాంగ్ రిలీజ్.. ఆధ్యాత్మిక శోభలో ట్రెండింగ్! ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడిన పోప్ లియో నాగచైతన్య, దుల్కర్ లాంచ్ చేసిన ‘డోంట్ స్లీప్’ టీజర్.. హాలీవుడ్ రేంజ్‌లో సైకలాజికల్ థ్రిల్లర్! రూ.1.65 లక్షల వ్యయంతో మినీ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బాల్యవివాహాలు సమాజానికి శాపం ఓటీటీలో తగ్గేదేలే అంటున్న స్లైస్ ఆఫ్ లైఫ్ వెబ్ సిరీస్‌లు.. దుపహియా సీజన్ 2 సరికొత్త రికార్డులు!

సామాజిక సేవకు గుర్తింపుగా అందుకున్న అంతర్జాతీయ అవార్డుపై సుమన్ అభినందనలు

Select Suryaa Now
సామాజిక సేవకు గుర్తింపుగా అందుకున్న అంతర్జాతీయ అవార్డుపై సుమన్ అభినందనలు

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రముఖ సినీ నటుడు, కరాటే బ్లాక్ బెల్ట్, స్టంట్ మాస్టర్ సుమన్‌ను తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కలుసుకుని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సామాజిక సేవకు గుర్తింపుగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ అందుకున్న ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డుపై హీరో సుమన్ అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ మాట్లాడుతూ, సినీ రంగంలో తనదైన నటనతో, అద్భుతమైన మార్షల్ ఆర్ట్స్ పోరాట సన్నివేశాలతో హీరో సుమన్ ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని అన్నారు. యాక్షన్ చిత్రాల నుంచి భక్తిరస చిత్రాల వరకు విభిన్న పాత్రలు పోషిస్తూ తన నటనా ప్రతిభను చాటుకున్నారని కొనియాడారు. ముఖ్యంగా భక్తి చిత్రాల్లో దైవత్వాన్ని ప్రతిబింబించే పాత్రలతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు.

సినీ రంగంలోనే కాకుండా సమాజంలోనూ సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే వ్యక్తులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని అశోక్ యాదవ్ అభిప్రాయపడ్డారు. హీరో సుమన్‌ను కలుసుకుని సన్మానించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

అనంతరం హీరో సుమన్ మాట్లాడుతూ, సామాజిక సేవకు గుర్తింపుగా అంతర్జాతీయ స్థాయిలో అవార్డు అందుకోవడం అభినందనీయమని డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్‌ను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. ఆయన చేపట్టే సామాజిక సేవా కార్యక్రమాలకు తన ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మేనేజర్ వెంకటరావు, శివ కొండల్, డాక్టర్ ఎం.కె. రాజేష్ తదితరులు పాల్గొన్నారు.