BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

రాబోయే తరానికి బతుకమ్మ ప్రాశాస్థ్యం,తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను అందించాలి ---ఎమ్. పి. ఈటల.

Select Suryaa Now
రాబోయే తరానికి బతుకమ్మ ప్రాశాస్థ్యం,తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను అందించాలి ---ఎమ్. పి. ఈటల.

హైదరాబాద్ /ఆల్వాల్, మేజర్ న్యూస్ : సద్దుల బతుకమ్మ చివరి రోజు సంబరాల్లో మల్కాజ్గిరి ఎమ్. పి. ఈటల రాజేందర్ పాల్గొని బతుకమ్మను ఎట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతం లో జరుపుకునే పండుగల్లో బతుకమ్మ పండుగకు ఒక ప్రత్యేకత ఉందని, అదేమిటంటే ప్రకృతి లో విరబూసిన 101 పువ్వులను సేకరించి బతుకమ్మను పేర్చి 9 రోజులు గౌరమ్మకు బతుకమ్మ పాటలతో ఆడుతూ జరుపుకొనే పండుగ అని వివరించారు.ప్రకృతి, పువ్వులనే దేవతలుగా కొలిచే పండుగ బతుకమ్మ పండుగ. ఈ పండుగ ఎంగిలి పూల బతుకమ్మ తో ప్రారంభమై 9 వ రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. 

ఈ సందర్బంగా కొత్తగా పెళ్ళైన ఆడపడచులు తల్లి గారి ఇంటికి వచ్చి ఇంకా పెళ్లికాని చెల్లెల్లు , తోటి ఆడపడచులతోరంగు రంగుల కొత్త దుస్తులు ధరించి సంతోషంగా ఆడుతూ పాడుతూ గడిపే పండుగ అని, ముత్తయిదువులు బతుకమ్మ తో పాటు గౌరీ పూజలు చేస్తూ తొమ్మిదో రోజు గౌరమ్మను ఒకరికొకరు పసుపు కుంకుమలు పంచుతూ, గౌరమ్మకు వీడుకోలుగా పోయిరా గౌరమ్మ... పోయి రావమ్మా అంటూ నీటిలో నిమజ్జనం చేసి సద్ధులను పంచుకొని ఇంటికి వస్తారు. అలాగే అధర్మం పై ధర్మం గెలిచిన రోజు విజయ దశమిగా దసరాను పురుషులు, స్త్రీలు జరుపుకొనేది దసరా పండుగ. ఈ దసరా పండుగ కుడా దుర్గా మాత ను 9 రోజులు  9 రూపాల్లో అలంకరించుకొని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపాల్లో పూజలు నిర్వహించి, 9 రోజు నిమజహనం చేస్తారు. అనంతరం శమి వృక్షానికి పూజలు చేసి ఆ వృక్షం యొక్క ఆకులను ఒకరికొకరు పంచుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకోవడం ఆనవాయితీ గా వస్తున్నది. ఈ పండుగలను, ఈ సంస్కృతిని కాపాది మన రాబోయే తరానికి అందించాలని ఆయన కోరారు.