BREAKING
కొత్త లగ్జరీ కారు కొన్న 'ప్రేమలు' హీరో నస్లెన్.. ధర ఎన్ని కోట్లు అంటే! ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్ష నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు! 132/33 kv నూతన sub- స్టేషన్ ప్రారంభం గురవరాజుపల్లి మినీ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం... ఆరోగ్య భీమా కార్డుల పంపిణీ హైడ్రా-తో నగర చెరువులన్నీ సుందరవనాలు: భాగ్యనగరానికి సరికొత్త జల వైభవం కాశి కాలభైరవ స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే? వైఎస్సార్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగింపు పండగలు లేదా వరుస సెలవులు వస్తే హైదరాబాద్ రోడ్లన్నీ పూర్తిగా ఖాళీ శివలింగ ని తాకిన సూర్యకిరణాలు. నిన్న మెడికవర్ హైవే సమీపంలో పాస్‌ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన... ప్రభాకర్ చౌదరికి టీడీపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత నాయకులు

ప్రేమ వేధింపులే ప్రాణం తీశాయా..?

Select Suryaa Now
ప్రేమ వేధింపులే ప్రాణం తీశాయా..?

రావులపల్లిలో వ్యవసాయ బావిలో యువతి మృతదేహం

ముఖంపై రక్తగాయాలు.. హత్యేనని తల్లి ఆరోపణ

అనుమానితుడు చరణ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్: ప్రేమ పేరుతో వేధింపులు.. చివరకు అనుమానాస్పద స్థితిలో యువతి మృతి.. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రావులపల్లి గ్రామంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామానికి చెందిన శిరీష (18) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో మృతదేహంగా కనిపించింది. ఆమె మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రేమ వేధింపులే ఈ విషాదానికి కారణమా? లేక మరేదైనా జరిగిందా? అన్న ప్రశ్నలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.

ఫోన్లు చేస్తూ వేధించాడని ఆరోపణలు

కుటుంబ సభ్యుల ఆరోపణల ప్రకారం.. చరణ్ అనే యువకుడు శిరీషకు తరచూ ఫోన్లు చేస్తూ వేధించేవాడు. శుక్రవారం సాయంత్రం నుంచి బయటకు రావాలంటూ పదేపదే ఫోన్లు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీష గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో విగతజీవిగా కనిపించడం పలు అనుమానాలకు తావిస్తోంది.

ముఖంపై గాయాలు.. హత్య చేశారని తల్లి ఆవేదన

బావిలో లభించిన శిరీష మృతదేహంపై, ముఖ్యంగా ముఖంపై రక్తగాయాలు ఉండటంతో కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తన కుమార్తెను చరణ్ హత్య చేసి బావిలో పడేశాడని మృతురాలి తల్లి తీవ్ర ఆరోపణలు చేసింది. తన కుమార్తె మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అయితే, యువతి మృతికి గల అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

మృతదేహం వెలికితీత.. పోలీసుల విచారణ

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్థుల సహాయంతో బావిలో నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి అనుమానితుడు చరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.శిరీష మృతిపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణ అనంతరం మరణానికి గల కారణాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. యువతి మృతితో రావులపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.