ప్రభాకర్ చౌదరికి టీడీపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత నాయకులు
అనంతపురం బ్యూరో : టీడీపీ సీనియర్ నాయకుడు, గుత్తి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కత్రిమల ప్రభాకర్ చౌదరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గుంతకల్లు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆవుల శివతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ప్రభాకర్ చౌదరితో కేక్ కట్ చేయించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవిస్తూ ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కాలాపురం టీడీపీ నాయకుడు, యూనిట్ కో-కన్వీనర్ సుధాకర్ యాదవ్, రామకృష్ణ యాదవ్, ఆరో వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు సల్లా రామకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ : మొయినుద్దీన్, అనంతపురం బ్యూరో, అనంతపురం.