BREAKING
కొత్త లగ్జరీ కారు కొన్న 'ప్రేమలు' హీరో నస్లెన్.. ధర ఎన్ని కోట్లు అంటే! ఎస్‌ఐఆర్‌ అక్రమాలపై అఖిలపక్ష నిరసన ర్యాలీ సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ పల్లె పండుగ 3.0తో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు! 132/33 kv నూతన sub- స్టేషన్ ప్రారంభం గురవరాజుపల్లి మినీ గ్రంథాలయాన్ని తనిఖీ చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ యువ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం... ఆరోగ్య భీమా కార్డుల పంపిణీ హైడ్రా-తో నగర చెరువులన్నీ సుందరవనాలు: భాగ్యనగరానికి సరికొత్త జల వైభవం కాశి కాలభైరవ స్వామివారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ త్రిమూర్తులు శ్రీ విష్ణు 'కామ్రేడ్ కళ్యాణ్' మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ కలెక్షన్స్ ఎంతంటే? వైఎస్సార్ విగ్రహం వద్ద ఆక్రమణలు తొలగింపు పండగలు లేదా వరుస సెలవులు వస్తే హైదరాబాద్ రోడ్లన్నీ పూర్తిగా ఖాళీ శివలింగ ని తాకిన సూర్యకిరణాలు. నిన్న మెడికవర్ హైవే సమీపంలో పాస్‌ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణానికి శంకుస్థాపన... ప్రభాకర్ చౌదరికి టీడీపీ నాయకుల జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపిన తెలుగు యువత నాయకులు

ప్రజా సేవకే నా తొలి ప్రాధాన్యత

Select Suryaa Now
ప్రజా సేవకే నా తొలి ప్రాధాన్యత

 

 సూర్య కరీంనగర్ :ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కరీంనగర్ జిల్లా చైర్మన్‌గా ఎన్నికైన టీఎన్జీవోల సంఘం జిల్లా కార్యదర్శి సంగెం లక్ష్మణ్‌రావును కరీంనగర్ అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ప్రజాసేవలో ఆయన అందిస్తున్న సేవలను కొనియాడుతూ సంఘం ప్రతినిధులు, సభ్యులు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సత్కరించారు.ఈ సందర్భంగా చైర్మన్ సంగెం లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్‌గా ఎన్నిక కావడం ఎంతో సంతోషంగా ఉందని, తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా అందించే సేవలు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆపదలో ఉన్నవారికి, పేదలకు, అవసరమైన వారికి సేవలందించడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు.అఖిల బ్రాహ్మణ సేవా సంఘం తనను ఘనంగా సన్మానించడం ఆనందంగా ఉందని, తన సంఘానికి, సమాజానికి మరింత సేవ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని ఆయన పేర్కొన్నారు. 
ప్రజల ఆదరాభిమానాలతో సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో అఖిల బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు జి.వి. రంగారావు, ప్రధాన కార్యదర్శి పురం ప్రేమ్‌చందర్‌రావు, నాయకులు పెండ్యాల ఆనంద్,  శ్రీనివాసరావు, సంజీవరావు,   చంద్రమౌళి, రామారావు .టీఎన్జీవోల సంఘం కరీంనగర్ టౌన్ అధ్యక్షులు మారుపాక రాజేష్ భరద్వాజ్, ఎర్రబాటి రంగారావు, శశికాంత్, సీహెచ్ కృష్ణమోహన్, శ్రీచరణ్, రవితేజ, పురాణం రాము, విజయకుమార్, వెంకటేశ్వరరావు, గోపాలరావు, గజవెల్లి రాజేంద్రప్రసాద్, గర్శకుర్తి శ్రీనివాసరావు, శ్రీధర్‌రావు తదితరులు హాజరై లక్ష్మణ్‌రావుకు అభినందనలు తెలిపారు.సంఘం ప్రతినిధులు, నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో సన్మాన కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.