ఫ్రెషర్స్ డే వేడుకల్లో ఎమ్మెల్యే....
మండల కేంద్రంలోని దేవకి గార్డెన్ లో జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. విద్యార్థి దశలోనే తమ భవిష్యత్‌కు బలమైన పునాది వేసుకోవాలని, విద్యతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకొని ఉన్నత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు. కొత్తగా కళాశాలలో చేరిన విద్యార్థులకు ఆహ్లాదకరమైన విద్యా వాతావరణం కల్పిస్తూ, వారి ప్రతిభను ప్రోత్సహించేందుకు అవసరమైన సహకారం అందించాలని కళాశాల అధ్యాపకులను ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
మేజర్ న్యూస్ తలకొండపల్లి