BREAKING
రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు. క్యూట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘లిటిల్ థామస్’ ట్రైలర్.. ఆకట్టుకుంటున్న గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ నటన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2027 షెడ్యూల్‌ విడుదల.. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి “ఎమ్మెల్యేకి వినతి ” బిగ్ బాస్ తెలుగు సీజన్ 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు క్రమశిక్షణే విద్యార్థి విజయానికి తొలిమెట్టు * విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

పేదల సేవలో 2.0తో అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు

Select Suryaa Now
పేదల సేవలో 2.0తో అర్హులందరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు

భీమవరం మేజర్ న్యూస్: అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. భీమవరం 8వ వార్డు కంకరదొడ్డి చినరంగనిపాలెంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధ్యక్షతన గురువారం నిర్వహించిన ‘పేదల సేవలో 2.0’ గ్రామ సభలో మంత్రి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.జిల్లాలో ప్రతి నెల సుమారు 2.19 లక్షల మందికి రూ.95 కోట్ల నుంచి రూ.98 కోట్ల వరకు పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కొత్తగా పింఛన్ల కోసం వచ్చిన సుమారు 45 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తయి ప్రభుత్వానికి పంపినట్లు చెప్పారు. అనుమతులు వచ్చిన వెంటనే అర్హులకు పింఛన్లు అందిస్తామన్నారు. పింఛన్‌దారుడు మరణిస్తే అర్హత ఉన్న భార్యకు పింఛన్ అందించే విధానంలో భాగంగా ఈ నెల 184 మందికి ప్రయోజనం కల్పిస్తున్నట్లు తెలిపారు.ప్రతి నెల మొదటి తేదీని ప్రజలతో మమేకమయ్యే రోజుగా నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారని, పింఛన్ల పంపిణీతో పాటు ఉచిత బస్సు, గ్యాస్ సిలిండర్, రేషన్, పారిశుధ్యం, స్వయం సహాయక సంఘాల రుణాలు తదితర పథకాల అమలును క్షేత్రస్థాయిలో పరిశీలించాలని మంత్రి సూచించారు. ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పరిష్కరించి, పరిష్కార స్థితిని వారికి తెలియజేయాలన్నారు.ప్రస్తుతం అర్హులకు రూ.4 వేల పింఛన్‌తో పాటు డయాలసిస్ రోగులకు రూ.10 వేలు, 100 శాతం దివ్యాంగులకు రూ.15 వేల వరకు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రజలు సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మూడు కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థకు సుమారు రూ.78 వేల వరకు సబ్సిడీ అందుతోందన్నారు. జిల్లాలో ఇప్పటికే 11 వేల మంది సౌర విద్యుత్ వ్యవస్థలు ఏర్పాటు చేసుకున్నారని, మరో 10 వేల కనెక్షన్లు ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు.భీమవరం పట్టణంలో పలు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటాన్ని గమనించానని, వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచి, దోమలు, జ్వరాల నివారణకు పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, ప్రతి నెల మొదటి తేదీ పింఛన్ల పంపిణీ పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పండుగ వాతావరణాన్ని కల్పిస్తోందన్నారు. సెప్టెంబరు 12 నుంచి 19 వరకు కొత్త పింఛన్ల కోసం దరఖాస్తులు స్వీకరించగా సుమారు 45 వేల దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో 2,500 మంది మార్గదర్శకుల ద్వారా సుమారు 45 వేల బంగారు కుటుంబాలకు ప్రభుత్వ పథకాలు, సేవలు అందుతున్నాయా లేదా పరిశీలించే కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మాట్లాడుతూ పేదల సంక్షేమం, పేదరిక నిర్మూలన, ఆర్థిక అసమానతల తగ్గింపే ‘పేదల సేవలో 2.0’ లక్ష్యమన్నారు. పేద కుటుంబాలను స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్లడంతో పాటు మహిళల ఆర్థిక బలోపేతం, ప్రభుత్వ సేవలను వేగంగా అందించడం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు.కార్యక్రమంలో మాజీ మంత్రి పీతల సుజాత, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, భీమవరం ఏఎంసీ చైర్మన్ కలిదిండి సుజాత, ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, డీఆర్‌డీఏ పీడీ ఎంఎస్‌ఎస్ వేణుగోపాల్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

 

 శ్రీనివాస్ భీమవరం