BREAKING
రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన అమరావతిలో చంద్రబాబు, లోకేష్‌తో చిన్న శ్రీను, సిరమ్మ భేటీ నెల రోజుల్లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్‌‌.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేష్ ఆదేశం ఎస్సీల నిధులు ఎస్సీ కాలనీల అభివృద్ధికే వినియోగించాలి ఎస్సీ నిధులు దారి మళ్లిస్తే సహించేది లేదు బీఎస్పీ కృష్ణాజిల్లా అధ్యక్షులు గుంటూరు నాగేశ్వరరావు వెల్లి విరిసిన ఆత్మీయత ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీపై పరిశీలించిన డిప్యూటీ ఎంపీడీవో.. మొదటి వారంలో 52 కోట్లు రాబట్టిన ‘వాన్’ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వం ఎజెండా అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన శాసనసభ్యులు కిమిడి కళావెంకటరావు. క్యూట్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ‘లిటిల్ థామస్’ ట్రైలర్.. ఆకట్టుకుంటున్న గుల్షన్ దేవయ్య, రసికా దుగల్ నటన ఐసీసీ వన్డే వరల్డ్‌కప్‌-2027 షెడ్యూల్‌ విడుదల.. ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించి ఆదుకోవాలి “ఎమ్మెల్యేకి వినతి ” బిగ్ బాస్ తెలుగు సీజన్ 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. డేంజర్ జోన్‌లో ఆ ఇద్దరు కంటెస్టెంట్లు క్రమశిక్షణే విద్యార్థి విజయానికి తొలిమెట్టు * విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు

బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్న యముడు జగన్ : నరసింహ యాదవ్ ఫైర్

Select Suryaa Now
బీసీల రిజర్వేషన్లు అడ్డుకున్న యముడు జగన్  : నరసింహ యాదవ్ ఫైర్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన జీవోలను హైకోర్టులో పిటిషన్లు వేయించి అడ్డుకున్న యముడు జగన్ అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు, యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి.నరసింహ యాదవ్ ధ్వజమెత్తారు. ప్రెస్ క్లబ్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 

జీవోలు రద్దు వెనుక వైసీపీ కుట్ర

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థలు, నగరపాలక, పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కోసం ప్రభుత్వం జీవో నెంబర్ 105, 1065 జారీ చేసిందన్నారు. అయితే వీటిని హైకోర్టు రద్దు చేస్తూ తీర్పునిచ్చిందని తెలిపారు.ఈ పిటిషన్ వేసిన పి.వెంకట నరసింహ శర్మ, వాదించిన న్యాయవాది గండాల శివప్రసాద్ రెడ్డి ఇద్దరూ వైసీపీకి చెందిన వారేనని, శివప్రసాద్ రెడ్డి వైసీపీ హయాంలో ఏజీపీగా పనిచేశారని, వారికి జగన్ తో ఉన్న ఫోటోలను మీడియాకు చూపించారు.

16,810 పదవులు దూరం

జగన్ హయాంలో కూడా హైకోర్టు రిజర్వేషన్ కొట్టేస్తే సుప్రీంకోర్టుకు వెళ్లకుండా బీసీలకు రావాల్సిన 16,810 పదవులను దూరం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో 53 శాతం బీసీలు ఉన్నారని ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాతే జీవోలు ఇచ్చామని స్పష్టం చేశారు.

సుప్రీంకోర్టుకు వెళ్తాం

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాలు చేస్తామని, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలో టీడీపీ కట్టుబడి ఉందని తెలిపారు. టీడీపీ ఆవిర్భావం నుంచి బీసీలకు అండగా ఉందని, 1987లో 20 శాతం1995లో 34 శాతం రిజర్వేషన్ ఇచ్చిన చరిత్ర టీడీపీదే అన్నారు.

అభివృద్ధి నిధులకు అడ్డంకి

6 వారాల్లో ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలన్న హైకోర్టు సూచనను స్వాగతిస్తున్నామన్నారు. ఎన్నికలు జరగకపోతే 16వ ఆర్థిక సంఘం నుంచి పట్టణాలకు రావాల్సిన రూ.14,500 కోట్లు, గ్రామీణానికి రావాల్సిన రూ.13,000 కోట్లు ఆగిపోతాయని, ప్రస్తుతం 123 మున్సిపాలిటీల్లో రూ.5,700 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ఎన్నికలను అడ్డుకుని అభివృద్ధిని అడ్డుకోవాలని జగన్ చూస్తున్నారని విమర్శించారు.