ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరి
జిన్నారం :జిన్నారం మండలంలోని పట్టాదారు రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో భాగంగా ప్రతి రైతు రిజిస్ట్రేషన్ ఫార్మర్ ఐడి సమకూరుస్తున్నట్లు తెలిపారు. ఒక రైతు ఒక గుర్తింపు సమగ్ర సేవలు లక్ష్యంగా అన్నదాతల వివరాలను డిజిటల్ గా నమోదు చేయడమే దీని ముఖ్య ఉద్దేశమన్నారు. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకొని రైతులు ప్రత్యేక శిబిరాల ద్వారానైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనీ విస్తృత ప్రచారం చేస్తున్నారు. మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లోనూ దండోరా వేయిస్తున్నారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసి ప్రభుత్వ పథకాలు ప్ర యోజనాలను ఉపయోగించుకోవాలని కోరారు.