పీసరి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో దేవరయాంజాల్‌లో నేడు బతుకమ్మ పోటీలు
శామీర్‌పేట, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11): విజయదశమి పండుగను పురస్కరించుకుని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శామీర్‌పేట డివిజన్ దేవరయాంజాల్‌లో ఆదివారం సాయంత్రం 4 గంటలకు బతుకమ్మ పోటీలు నిర్వహించనున్నారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు.ఈ సందర్భంగా పెద్దలు, చిన్నారులకు వేర్వేరుగా బతుకమ్మ, బతుకమ్మ పాటల పోటీలు నిర్వహించనున్నారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు బహుమతులు అందజేయనున్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.డ్వాక్రా మహిళలు, మహిళా సంఘాల సభ్యులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ పోటీలను విజయవంతం చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి కోరారు.
రిపోర్టర్: తాటికొండ రవి గౌడ్, శామీర్ పేట్, మేడ్చల్ జిల్లా.