BREAKING
వృద్ధుల హక్కులను కాపాడటం మన బాధ్యత కాపీరైట్ వివాదంలో సంగీత మాంత్రికుడు ఇళయరాజాకు ఊహించని ఎదురుదెబ్బ.. కోర్టులో కీలక తీర్పు గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా ముందుండి నడిపిస్తా పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి -యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోళ్ళ పవన్ కుమార్ ఆస్ట్రేలియా మేయర్‌గా తెలంగాణ ఆడబిడ్డ...! మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట నోటీసులు అందుకున్న ఓటర్ల వద్దకే బిఎల్ఓలు.. సీఈవో సుదర్శన్ రెడ్డి కీలక ప్రకటన ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందనలు అప్స డెమొక్రటిక్ డివిజన్ అధ్యక్షురాలుగా పోలిశెట్టి కనకదుర్గ భవాని రేపే ‘సిగ్మా’ సినిమా విడుదల.. పైరసీ చేసేవారికి హీరో సందీప్ కిషన్ గట్టి వార్నింగ్ బీసీల రిజర్వేషన్ల జీవోలను హైకోర్టు కొట్టివేయడంపై చంద్రబాబు సమాధానం చెప్పాలి తెలుగు చిత్ర పరిశ్రమలో ఓటీటీ హడావుడి.. డిజిటల్ రైట్స్ కోసమే సినిమాలు చేస్తున్నారా? పంచాయతీల్లో చెక్కుల చెల్లింపులకు మార్గం సుగమం.. ఉప సర్పంచ్‌ల జాప్యంపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం ప్రజా సమస్యల పరిష్కారానికి జర్నలిస్టులు పాటుపడాలి. డిసిసి అధ్యక్షుడు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి

పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యం ----సెవోత్తమ్ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్.

Select Suryaa Now
పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యం ----సెవోత్తమ్ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్.

పౌరులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యం
----సెవోత్తమ్ శిక్షణ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంబదాస్ రాజేశ్వర్.

మెదక్ ; పౌరులకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో సేవలు అందించడమే సేవోత్తమ్ కార్యక్రమం లక్ష్యం అని జిల్లా అదనపు కలెక్టర్ అంబదాసు రాజేశ్వర్ అన్నారు.

బుధవారం కలెక్టరేట్లోని మినీ సమావేశ మందిరంలో సేవోత్తమ్ కార్యక్రమాన్ని లో కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ ఉండి సూపరిండెంట్ స్థాయి వరకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అంబదాసు రాజేశ్వర్ మాట్లాడుతూ..
ప్రభుత్వ సేవలను మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, జవాబుదారీతనంతో ప్రజలకు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సెవోత్తమ్  యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు.ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు సకాలంలో, నాణ్యమైన సేవలు అందించడంతో పాటు వారి సమస్యలను వేగంగా పరిష్కరించేలా అధికారులు, సిబ్బందిలో సామర్థ్యాన్ని పెంపొందించడమే ఈ శిక్షణ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని  తెలిపారు.
సెవోత్తమ్ అనేది “సేవలో అత్యుత్తమత”  సాధించేందుకు రూపొందించిన కార్యక్రమమని,ఈ విధానంలో పౌరుల చార్టర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, సేవల అందించే సామర్థ్యాన్ని పెంపొందించడం వంటి మూడు ప్రధాన అంశాలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
శిక్షణలో భాగంగా ప్రజలకు అందించే ప్రతి ప్రభుత్వ సేవకు సంబంధించి సేవా ప్రమాణాలను నిర్ధారించడం, నిర్ణీత కాలవ్యవధిలో సేవలను అందించడం, సేవల నాణ్యతను పర్యవేక్షించడం, 
ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం, ఫిర్యాదులను సమయానుకూలంగా పరిష్కరించడం వంటి అంశాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.ఈ కార్యక్రమంలో ఏవో యూనస్, రీజనల్ ట్రైనింగ్ మేనేజర్ శంకర్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.