telanagana
పరిగి ఎమ్మెల్యే టీఆర్ ఆర్ నివాసంలో పూల పండుగ సందడి
పరిగి, మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి నివాసంలో శ్రీమతి ఉమా రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని బతుకమ్మ సంబరాల్లో భాగస్వాములయ్యారు. రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలతో మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని,బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి, సంప్రదాయాల వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొనడంతో ఎమ్మెల్యే నివాసంలో పండుగ సందడి నెలకొంది. సంప్రదాయబద్ధంగా సాగిన ఈ వేడుకలు అందరిలో ఆనందోత్సాహాలను నింపాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు, మహిళలు, యువతులు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబరాల్లో ఉత్సాహంగా భాగస్వాములయ్యారు.