పదో తరగతి మూల్యాంకన జవాబు పత్రాల వేలానికి కోటేషన్ల ఆహ్వానం
రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి సంబంధించిన పదో తరగతి మార్చి 2025 ప్రభుత్వ పరీక్షల మూల్యాంకన జవాబు పత్రాలను వేలం వేయనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు ఒక ప్రకటన లో తేెలిపారు. ఈ వేలంలో పాల్గొనదలచిన జిల్లాలోని రద్దీ వ్యాపారులు రూ.10,000ల డిమాండ్ డ్రాఫ్ట్ను జిల్లా విద్యాశాఖాధికారి, రంగారెడ్డి జిల్లా పేరున తీసి, తమ ధరల వివరాలతో కూడిన సీల్డ్ కోటేషన్లను సమర్పించాలని సూచించారు.
కోటేషన్లను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు రంగారెడ్డి జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం, ఐడీఓసీ, కొంగర కలాన్లో అందజేయాలని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు టెండర్లను తెరవనున్నట్లు వెల్లడించారు.
వేలంలో పాల్గొనదలచిన వ్యాపారులు నిర్ణీత గడువులోగా తమ కోటేషన్లను సమర్పించాలని జిల్లా విద్యాశాఖాధికారి కోరారు.
(రంగారెడ్డి - మేజర్ న్యూస్)