BREAKING
కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలి వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్‌.. రిస్ట్రిక్టెడ్ చాట్‌తో మరింత భద్రత ఘనంగా అంతర్జాతీయ మహిళా రైతు దినోత్సవం ఘనంగా తిరునక్షత్ర మహోత్సవం విషాద ఘటనలో మృతి చెందిన కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి 108 సేవలను సద్వినియోగం చేసుకోవాలి చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి ఏర్పాటు పరిశీలించిన ఎన్నికల అధికారి పేదింట పెళ్లి పందిరికి ప్రభుత్వ చేయూత!* శరన్నవరాత్రుల సందర్భంగా పంచమి లక్ష్మివారం ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో పేరు లేదని మహిళ నిరసన కార్తీక్ ఆర్యన్, శ్రీలీల రొమాంటిక్ మ్యూజికల్ మూవీ విడుదల వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే? అక్రమంగా ఆవుల తరలింపు వాహనం పట్టివేత... రుషింగి దుర్గా దేవి ఆలయంలో మహిళలు భక్తిశ్రద్ధలతోకుంకుమ పూజలు నేనేం చేయలేను..! అది అధిష్టానం నిర్ణయం..

పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం

Select Suryaa Now
పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం
సూర్య తిర్యాణి : తిర్యాణి, మండల కేంద్రంలోని కొమరం కాంప్లెక్స్‌లో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కులబాంధవుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర, జిల్లా నాయకులకు మండల అధ్యక్షుడు అన్నం రాజేష్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండలంలోని పద్మశాలీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై చర్చించారు.జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్ల ఆంజనేయులు మాట్లాడుతూ, పద్మశాలీల కులదైవమైన మార్కండేయ ఆలయ నిర్మాణానికి అవసరమైన స్థల సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో మాట్లాడి స్థలం కేటాయించేలా ప్రయత్నించడంతోపాటు ఆలయ నిర్మాణానికి తమవంతు సహకారం అందిస్తామని తెలిపారు. కులబాంధవులు తమ సమస్యలను సంఘం దృష్టికి తీసుకురావాలని, వాటి పరిష్కారానికి ఎల్లవేళలా శాయశక్తులా సహకరిస్తామని భరోసా ఇచ్చారు.అనంతరం తిర్యాణి మండల పద్మశాలి సంఘం నూతన కమిటీకి ఎన్నికైన అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారిని నాయకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు గుండా శంకరయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి గడదాసు మల్లయ్య, మాజీ అధ్యక్షుడు, జిల్లా నాయకుడు హనుమండ్ల శంకర్, జిల్లా నాయకులు కొమరపల్లి లింగయ్య, మారిన వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు అన్నం రాజేష్, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మేన రాములు, జంజీరాల సంతోష్, కోశాధికారి గుండా అశోక్‌తోపాటు ఉల్లిపిట్ట, గంభీరావుపేట, తిర్యాణి గ్రామాలకు చెందిన పద్మశాలి కులబాంధవులు పాల్గొన్నారు