BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

నందిగామలో ఘనంగా బతుకమ్మ సంబరాలు * సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సింగర్ మంగ్లీ, జంగిరెడ్డినందిగామలో ఘనంగా బతుకమ్మ సంబరాలు * సర్పంచ్ ఎల్లగొని విక్రంగౌడ్

Select Suryaa Now
నందిగామలో ఘనంగా బతుకమ్మ సంబరాలు   * సంబరాల్లో పాల్గొన్న ప్రముఖ సింగర్ మంగ్లీ, జంగిరెడ్డినందిగామలో ఘనంగా బతుకమ్మ సంబరాలు * సర్పంచ్ ఎల్లగొని విక్రంగౌడ్

 

పటాన్ చెరు ;పటాన్ చెరు మండలం నందిగామ గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎల్లగొని విక్రంగౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలందరూ ప్రధాన కూడలిలో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ పాటలు పాడుతూ ఆనంద్ ఉత్సవాల మధ్య బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. యొక్క బతుకమ్మ వేడుకలకు ప్రముఖ సింగర్ మంగ్లీ, జంగిరెడ్డిలు పాల్గొని, బతుకమ్మ ఆటపాటలతో వేడుకను మహిళలతో కలిసి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మంగ్లీ ఆట పాటలతో బతుకమ్మ ఉత్సవాలు ఎంతో ఉల్లాసంగా కొనసాగాయి. గ్రామం ప్రధాన కూడలి హనుమాన్ మందిరం నుండి చెరువు కట్ట వరకు మహిళలు బతుకమ్మతో నడిచేందుకు గ్రీన్ మ్యాట్ ను ఏర్పాటు చేశారు. మహిళలందరూ బతుకమ్మ ఆడి గ్రామంలోని చెరువులో వదిలేసి వెళ్లి రావమ్మా అని వీడుకోలు పలికారు. సర్పంచ్ విక్రమ్ గౌడ్ బతుకమ్మ వేడుకలను అన్ని సదుపాయాలతో నిర్వహించారు. సింగర్ మంగ్లీతో ఫోటోలు దిగేందుకు మహిళలు, యువకులు ఆసక్తిని చూపారు. ఈ సందర్భంగా సర్పంచ్ విక్రమ్ గౌడ్ మాట్లాడుతూ.. దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గ్రామస్తులందరం కలిసి బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నామని తెలిపారు. అనివర్గాల ప్రజల పండగలను ఆనందోత్సవాల మధ్య జరుపుకుంటామని అన్నారు. గ్రామస్తుల సహకారంతో మునుముందు అన్ని వేడుకలను ఘనంగా జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పటాన్ చెరు మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం, స్థానిక ఉపసర్పంచ్ గోరేమియా, స్థానిక నాయకులు, మహిళలు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.