telanagana
నీళ్లపల్లిలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి భేటీ
బషీరాబాద్, మేజర్ న్యూస్: వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలోని నీళ్లపల్లి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పర్యటించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్త జగదీష్ జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మైల్వార్ గ్రామంలో ప్రతిష్ఠించిన దుర్గామాత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నర్సిరెడ్డి, సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి, మధు గౌడ్, సర్పంచులు పాండురంగారెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, వీరయ్య స్వామి, నాయకులు రామకృష్ణ రెడ్డి, గోపాల్ రెడ్డి, వెంకట్ రెడ్డి, తాహేర్, సంజీవ్, బుల్లెట్ శ్రీకాంత్, వేణు, హనుమంత్ రెడ్డి, ఉపసర్పంచ్ రాజు నాయక్, యాకంరి తదితరులు పాల్గొన్నారు.