BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

నల్లకుంట శంకరమఠంలో వైభవంగా శారదా శరన్నవరాత్రులు: దుర్గాదేవిగా దర్శనమిచ్చిన శారదాంబ

Select Suryaa Now
నల్లకుంట శంకరమఠంలో వైభవంగా శారదా శరన్నవరాత్రులు: దుర్గాదేవిగా దర్శనమిచ్చిన శారదాంబ

నల్లకుంట , మేజర్ న్యూస్ :: నగరంలోని ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన నల్లకుంట శ్రీ శృంగేరి శంకరమఠంలో శ్రీ శారదా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా, ఆధ్యాత్మిక శోభతో కొనసాగుతున్నాయి. దేవీ నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా ఆదివారం జగన్మాత శారదాంబ దుర్గాదేవి అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. సింహవాహినియై, శంఖుచక్రాలు, త్రిశూలధారిణిగా తేజోమయ రూపంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు నగర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా శంకరమఠంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ అమ్మవారికి సంప్రదాయబద్ధంగా విశేష రుద్రాభిషేకం, కుంకుమార్చనలు, చండీ పారాయణం మరియు మహా మంగళహారతి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. లోకకల్యాణార్థం, ప్రజలందరూ ఆయురారోగ్యాలు మరియు ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని సంకల్పించి ఈ విశేష పూజలు జరిపారు. భక్తుల గోత్రనామాలతో అర్చనలు జరిపి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.

ఈ పవిత్ర పూజా కార్యక్రమంలో శంకరమఠం ధర్మాధికారి చింతలపాటి శ్రీనివాసమూర్తి, బ్రాంచ్ హెడ్ గోరుగంతు రవి తదితర మఠం ప్రతినిధులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందారు.