BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

నల్గొండ జిల్లాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు--- జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్

Select Suryaa Now
నల్గొండ జిల్లాలో ఘనంగా బతుకమ్మ ఉత్సవాలు--- జిల్లా కలెక్టర్ బి .చంద్రశేఖర్

నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్…రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో  బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ తెలిపారు.ఆదివారం అయన ఎన్జీ కళాశాల మైదానంలో విద్య ,అటవీ, ఆర్ అండ్ బి,తదితర శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరై బతుకమ్మలకు పూజలు నిర్వహించి బతుకమ్మ వేడుకలలోపాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ బతుకమ్మ ఉత్సవాలలో భాగంగా జిల్లా కేంద్రంతో పాటు, అన్ని గ్రామాలు ,మండలాలు, రెవెన్యూ డివిజన్లలో  బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని, బతుకమ్మ ఉత్సవాలు ప్రారంభమైన మొదటి రోజు నుండి చివరి వరకు ప్రతిరోజు నాలుగైదు జిల్లా శాఖల ఆధ్వర్యంలో ఎన్జీ కళాశాల మైదానంలో ఉత్సవాలు నిర్వహించినట్లు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ ఉత్సవాలను జిల్లా  వ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించడమే కాకుండా ప్రజలు స్వచ్ఛందంగా నిర్వహించుకోవడం సంతోషమని, అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ సంవత్సరం బతుకమ్మ ఉత్సవాలు వైభవంగా నిర్వహించారని తెలిపారు .చివరి రోజు సద్దుల బతుకమ్మ ఉత్సవాలలో సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొని బతుకమ్మ ఉత్సవాలను విజయవంతం చేశారని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా ప్రజలకు బతుకమ్మ శుభాకాంక్షలు తో పాటు, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు .నల్గొండ ఆర్డిఓ వై. అశోక్ రెడ్డి, డిఇఓ సుశీందర్రావు, ఆర్ అండ్ బి ,అటవీ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.