మృతుని కుటుంబాన్ని పరామర్శించిన కౌన్సిలర్
అమనగల్లు రంగారెడ్డి:
మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు సంకటోనిపల్లి గ్రామానికి చెందిన జంతుక ఎంకయ్య మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఐదో వార్డు కౌన్సిలర్, ఆర్యవైశ్య సంగం రాష్ట్ర నాయకుడు మృతునికి నివాళులర్పించి సంతాపం తెలిపారు. అనంతరం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పరామర్శించిన వారిలో మాజీ కౌన్సిలర్ రాధా వెంకటయ్య, ధనంజయ, శ్రీను నాయక్, యాదగిరి, నరసింహ, యాదయ్య, మల్లేష్, రవి, రామలింగం, తదితరులు ఉన్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్,