BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలా

Select Suryaa Now
ఆత్మకూరు మున్సిపల్ టిడిపి చైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ షకీలా

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మున్సిపాలిటీ చైర్ పర్సన్ కూటమి అభ్యర్థిగా ప్రముఖ రాజకీయ కుటుంబమైన బొమ్మిరెడ్డి కుటుంబంలోని డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా ఎంపికయ్యారు. ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం ప్రకటించడంతోపాటు జన సందోహం మధ్య కోలాహలంగా నిర్వహించిన ర్యాలీతో డాక్టర్ షకీలా మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. ఆమెతోపాటు ఆమె కోడలు యువ నేత బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి సతీమణి డాక్టర్ గీతికా రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేశారు. డాక్టర్ షకీలా వైద్యురాలుగా సేవలందిస్తూ బిఎస్సార్ హాస్పిటల్ ఎండిగా కొనసాగుతున్నారు. ఆమె దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బొమ్మిరెడ్డి సుందరరామిరెడ్డి కోడలు కాగా మాజీ మండలాధ్యక్షుడు, మాజీ సర్పంచ్,మాజీ టెలికం జిల్లా సలహా మండలి సభ్యులు దివంగత డాక్టర్ బొమ్మిరెడ్డి  రవీంద్రనాథ్ రెడ్డి సతీమణి. యువనేత, బిఎస్ఆర్ ట్రస్ట్ చైర్మన్ గా ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న బొమ్మిరెడ్డి తారకనాథరెడ్డి తల్లి డాక్టర్ షకీలా ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధి ధ్యేయంగా డాక్టర్ షకీలా రాజకీయ రంగ ప్రవేశం చేసి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆశీస్సులతో ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా పోటీలో దిగారు. బొమ్మిరెడ్డి కుటుంబం రాజకీయంగా ప్రాధాన్యత కలిగింది కాగా తారకనాథరెడ్డి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు డాక్టర్ షకీలా కూడా వైద్య సేవలతో పాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.ఆ కుటుంబానికి పట్టణంలో అత్యంత ఆదరణ ఉండడంతో పాటు అభివృద్ధికి మారుపేరైన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బలపరచడం ఆయన నాయకత్వంలో తెలుగుదేశం బిజెపి జనసేన కూటమి తరపున ఆమె పోటీ చేయడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. డాక్టర్ షకీలా విజయం కోసం ఆనం ప్రత్యేక శ్రద్ధతో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఆమెకు అన్ని వర్గాల నుండి మద్దతు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అందరూ భావిస్తున్నారు.