BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

Select Suryaa Now
ప్రశాంతంగా ముగిసిన స్థానిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ

నెల్లూరు,అర్బన్/క్రైమ్ (మేజర్ న్యూస్):
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.సుమారు 250 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేయడంతో నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు బుచ్చిరెడ్డిపాలెం, ఆత్మకూరు మున్సిపాలిటీల పరిధిలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా. అజిత వేజెండ్ల స్పష్టం చేశారు.అక్టోబర్ 16 నుంచి 18వ తేదీ వరకు నిర్వహించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో మేయర్, చైర్మన్ పదవులకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో 12, బుచ్చిరెడ్డిపాలెంలో 7, ఆత్మకూరులో 6 నామినేషన్లు దాఖలయ్యాయి.అదేవిధంగా కార్పొరేషన్ డివిజన్లు, మున్సిపల్ వార్డులకు నెల్లూరులో 403, బుచ్చిరెడ్డిపాలెంలో 100, ఆత్మకూరులో 106 నామినేషన్లు స్వీకరించారు.మొత్తం మూడు పట్టణ స్థానిక సంస్థల పరిధిలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు సమన్వయంతో పనిచేశారు.నామినేషన్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, కార్యకర్తలు, ప్రజలు స్వేచ్ఛగా తమ ఎన్నికల సంబంధిత కార్యక్రమాలు నిర్వహించుకునేలా భద్రత కల్పించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, ఎక్కడా ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో టౌన్ ఏఎస్పీని, బుచ్చిరెడ్డిపాలెంలో రూరల్ డీఎస్పీని, ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో ఆత్మకూరు డీఎస్పీని బందోబస్తు పర్యవేక్షణ బాధ్యతలకు నియమించారు.రానున్న ఎన్నికల దశలను దృష్టిలో ఉంచుకుని సమస్యాత్మక ప్రాంతాల్లో రూట్ మార్చ్‌లు, ఏరియా డామినేషన్ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు సున్నితమైన, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఎన్నికలకు సంబంధించిన కీలక పత్రాలు, సామగ్రి భద్రపరిచే స్ట్రాంగ్ రూముల వద్ద కూడా కట్టుదిట్టమైన భద్రత కల్పించి, నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టడం, బెదిరించడం, భయభ్రాంతులకు గురిచేయడం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ఎస్పీ హెచ్చరించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై నిఘా ఉంచి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు, బెదిరింపులకు లొంగకుండా స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.ఎన్నికల తదుపరి దశల్లోనూ శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తూ జిల్లా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.