BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్

Select Suryaa Now
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున చింతకాయల అనిత చైర్మన్ అభ్యర్థిగా నామినేషన్


నర్సీపట్నం అక్టోబర్ 18 మేజర్ న్యూస్:
నర్సీపట్నం మున్సిపాలిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చింతకాయల అనిత నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. బ్యాంక్ కాలనీలో సన్యాసిపాత్రుడు ఇంటి వద్ద నుండి మాజీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరారు. ఉమాశంకర్ గణేష్ మద్దతుతో పోటి చేస్తున్న ఛైర్ పర్సన్ అనితతో పాటు 40 వార్డుల అభ్యర్థులు ఊరేగింపుగా ర్యాలీలో పాల్గొన్నారు. డప్పులు మోత తో పండుగ పోతువరణం నెలకొంది. పెదబొడ్డేపల్లి ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలలో పాల్గొన్న అనంతరం మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. ఎలక్షన్ రిటర్నింగ్ అధికారి వి.వి.రమణకు నామినేషన్ పత్రాలను అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే గణేష్ మాట్లాడుతూ పరిపాలనపై పట్టున్న చింతకాయల అనితను అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఇప్పటికే సూపర్ 6 హమీలతో ప్రజలను మోసం చేశారని అన్నారు. చింతకాయల అనిత మాట్లాడుతూ మున్సిపల్ సమస్యల పట్ల తనకు అవగాహన ఉందని, తనను గెలిపిస్తే మౌలిక సదుపాయల కల్పనకు ప్రాధాన్యత కల్పిస్తానని హామీ ఇచ్చారు. వైసిపి సీనియర్ నాయకుడు సన్యాసిపాత్రుడు మాట్లాడుతూ ఎన్నికలు కార్పొరేట్ వ్యవస్థకు, సామాన్యులకు మధ్య పోటీగా అభివర్ణించారు. 40 ఏళ్ళుగా పట్టణ ప్రజలతో అనుబంధం ఉందన్నారు. రెండున్నర సంవత్సరాలుగా నర్సీపట్నంలో రౌడీయిజం పెరిగిపోయిందని, తమను గెలిపిస్తే శాంతియుత వాతావరణం అందిస్తామని అన్నారు.