పలాసలో మొత్తం 167 నామినేషన్లు దాఖలు.
చైర్మన్ పీఠానికి 11 మంది, కౌన్సిలర్లుగా 156 మంది పోటీ.
పలాస, అక్టోబర్ 18, మేజర్ న్యూస్.
పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఆదివారంతో ముగిసింది. చివరి రోజు వరకు మొత్తం 167 నామినేషన్లు దాఖలయ్యాయి.
పార్టీల వారీగా వివరాలు..
చైర్మన్ పదవికి (మొత్తం 11) :
టీడీపీ నుంచి 3, వైసీపీ నుంచి 2, కాంగ్రెస్ నుంచి 2, స్వతంత్రులు 4 మంది నామినేషన్లు వేశారు.
కౌన్సిలర్ పదవులకు (36 వార్డుల్లో మొత్తం 156) :
వైసీపీ నుంచి 68, టీడీపీ నుంచి 59, స్వతంత్రులు 13, జనసేన నుంచి 10, బీజేపీ నుంచి 6 మంది నామినేషన్లు దాఖలు చేశారు.
చివరి రోజు జోరు..
ఆదివారం చివరి రోజు ఒక్కరోజే 98 నామినేషన్లు దాఖలయ్యాయి. చైర్మన్ పదవికి 7 మంది (టీడీపీ-3, వైసీపీ-1, కాంగ్రెస్-2, స్వతంత్ర-1), కౌన్సిలర్లుగా 91 మంది (టీడీపీ-40, వైసీపీ-27, స్వతంత్రులు-11, జనసేన-7, బీజేపీ-6) నామినేషన్లు వేశారు.