BREAKING
నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా? అల్లరి నరేష్ ‘కనకదుర్గ’ నుంచి తొలి పాట విడుదల.. విజయవాడలో ఘనంగా ‘అమ్మ కనకదుర్గ’ ఆవిష్కరణ! పంచేడు వైసీపీ శ్రేణులు టీడీపీ బాట.. 50 మందికిపైగా నేతల చేరిక – ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వైభవంగా రామచంద్రపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు నామినేషన్ నాగన్ పల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు గుంతమార్పల్లిలో వైభవంగా బతుకమ్మ వేడుకలు మల్లేశ్వరం దసరా ఉత్సవాలలో ప్లాస్టిక్‌కు స్వస్తి.. స్టీల్ ప్లేట్లు, గ్లాసులతో అన్నసమారాధన! వేదపాఠశాలలో వస్త్ర పంపిణీ చేసిన నందమూరి మోహన రూపా, శ్రీమంతుని.. వేదపండితుల వేదాశీర్వచనం! వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

శరన్నవారాత్రుల ముగింపుపై డిఎస్‌పి సమీక్ష - కలశాలు...ఊరేగింపు

Select Suryaa Now
శరన్నవారాత్రుల ముగింపుపై డిఎస్‌పి సమీక్ష - కలశాలు...ఊరేగింపు

గూడూరు, మేజర్‌న్యూస్‌
గూడూరు పట్టణంలో శరన్నవారాత్రుల ముగింపులో నిర్వహించనున్న కలశాల కలశాల కార్యక్రమంపై డిఎస్‌పి నరసింహమూర్తి సమీక్షించారు. ఆదివారం ఉదయం దసరా శరన్నవరాత్రలు నిర్వహక కమిటీ సభ్యులతో సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ మరియు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై డీఎస్పీ ఆధ్వర్యంలో, గూడూరు రూరల్ సీఐ, గూడూరు 1 టౌన్ సీఐ మరియు గూడూరు 2 టౌన్ సిఐల సమక్షంలో కార్యక్రమ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని, ఎస్‌ఎస్‌టి, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల తనిఖీలకు సహకరించాలని సూచించారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడరాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో  ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. ఎటువంటి గొడవలు, ఘర్షణలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు తావివ్వకూడదని హెచ్చరించారు. కలశాల కార్యక్రమం 21వ రాత్రి ప్రారంభమై, 22వ తేది ఉదయం ముగించాలని స్పష్టం చేశారు. పోలీసు శాఖ విధించిన నిబంధనలు, సూచనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు, నిర్వాహకులు పోలీసు శాఖకు సహకరించి కార్యక్రమాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని గూడూరు పోలీసు శాఖ విజ్ఞప్తి చేస్తోంది.