BREAKING
మెటా అల్గారిథమ్స్‌పై కేంద్రం కీలక ఆదేశాలు: తప్పుదోవ పట్టించే కంటెంట్, శాంతిభద్రతల సమస్యలపై అడ్వైజరీ.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లకు మార్గదర్శకాలు! బ్రిటన్‌లో ఎన్‌స్కేల్‌తో డేటా సెంటర్ ఒప్పందాన్ని రద్దు చేసుకున్న మైక్రోసాఫ్ట్: ఐపీఓ వేళ స్టార్టప్‌కు గట్టి ఎదురుదెబ్బ! ఉక్రెయిన్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగంపై ఆంక్షలు ఉద్దేశపూర్వకమే: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు.. డ్రోన్ డిఫెన్స్‌కు తీవ్ర ఆటంకం! చైనాలోని జిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లో భూకంపం: రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రత నమోదు.. మైసూరు దసరాలో సూర్యకిరణ్ ఎయిర్‌షో విన్యాసాలు: రెండు దశల్లో తొమ్మిది విమానాలతో గగనతల విన్యాసాలు.. వింగ్ కమాండర్ తేజేశ్వర్ సింగ్ వెల్లడి! నటుడు టైగర్ ష్రాఫ్‌ను పరామర్శించిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే: కాల్పుల ఘటనపై ఆరా.. ఆరోగ్య పరిస్థితిపై సమీక్ష! ఫ్లోరిడాలో $191.8 మిలియన్లతో భారీ నీటి పునర్వినియోగ ప్రాజెక్ట్ పూర్తి: రోజుకు 32.5 లక్షల గ్యాలన్ల మురుగునీటి శుద్ధి.. మాతాంజాస్ నదికి కాలుష్య విముక్తి! యూపీకి చేరిన 308 చక్రాల ‘బాహుబలి’ ట్రక్: చెట్లు నరికి, విద్యుత్ స్తంభాలు తొలగించి దారి క్లియర్.. గమ్యస్థానానికి 200 టన్నుల భారీ మెషిన్! నేటి పంచాంగం – 19 అక్టోబర్ 2026. నేటి రాశి ఫలాలు – 19 అక్టోబర్ 2026 జపాన్, బ్రిటన్‌లను దాటేసి ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్: ఐఎంఎఫ్ తాజా అంచనాలు వెల్లడి! హెచ్-1బీ ఉద్యోగులపై వ్యాఖ్యలపై జేడీ వాన్స్ వివరణ:‘నా భాషలో లోపం ఉండొచ్చు’ అంటూ వ్యాఖ్య! ముంబైలో టెన్షన్.. టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహించినట్లు ప్రకటన టీడీపీపార్టీ విజయానికి సమిష్టిగా కృషి చేయాలి . దాట్ల పృథ్వీరాజ్.. తెలంగాణ విద్యార్థులకు ఒక న్యాయం.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు మరో న్యాయమా?

సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

Select Suryaa Now
సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు

• ఆటపాటలతో సందడిగా మారిన ప్రాంగణాలు.. • ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

సూర్య, మందమర్రి : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ వేడుకలు మందమర్రి సింగరేణి హైస్కూల్ మైదానం, ఇల్లందు క్లబ్‌లో ఘనంగా నిర్వహించారు. సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ ఎన్. రాధాకృష్ణ, సేవా సమితి అధ్యక్షురాలు ఎన్. శ్రీవాణి రాధాకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై వేడుకలను ప్రారంభించారు. వివిధ రకాల రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో ప్రాంగణాలు కళకళలాడాయి. పెద్ద సంఖ్యలో మహిళలు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొని బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. ఆటపాటలతో వేడుకలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఈ సందర్భంగా జీఎం ఎన్. రాధాకృష్ణ మాట్లాడుతూ.. సద్దుల బతుకమ్మ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని, పూలను, మహిళా శక్తిని ఆరాధించే విశిష్టమైన పండుగగా బతుకమ్మకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సింగరేణి కుటుంబాలన్నీ ఒకచోట చేరి ఐక్యతతో వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సంతోషాన్ని నింపాలని, సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వేడుకల్లో భాగంగా అందంగా బతుకమ్మలను పేర్చిన మహిళలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభ కనబరిచిన విజేతలకు మొదటి, రెండో, మూడో బహుమతులతోపాటు మరో ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌వో టు జీఎం జి.ఎల్. ప్రసాద్, ఏఐటీయూసీ వైస్‌ ప్రెసిడెంట్ సుదర్శన్, సీఓఎంఏఐ అధ్యక్షుడు రమేష్, డీజీఎం (పర్సనల్) సీహెచ్. అశోక్, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ వెంకటేశ్వర్ రెడ్డి, సింగరేణి అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, మహిళలు, ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.