BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!

Select Suryaa Now
అభివృద్ధికి పట్టం కట్టండి.. కూటమి అభ్యర్థులను గెలిపించండి!


​
- స్వచ్ఛమైన నర్సీపట్నంగా తీర్చిదిద్దుతామన్న ఎంపీ చింతకాయల విజయ్, చైర్‌పర్సన్ అభ్యర్థి పద్మావతి •

- పినారిపాలెంలో ఘనంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభం
నర్సీపట్నం అక్టోబర్ 18 మేజర్ న్యూస్ :
​నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కూటమి బలపరిచిన మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి, రాజ్యసభ సభ్యులు చింతకాయల విజయ్ ఆదివారం పినారిపాలెం రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు . ఈ కార్యక్రమంలో 1వ వార్డు అభ్యర్థి లాలం మురళీకృష్ణ, 2వ వార్డు అభ్యర్థి చిటికెల వెంకట నాగమణి, 3వ వార్డు అభ్యర్థి రుత్తల లక్ష్మి, 5వ వార్డు అభ్యర్థి మామిడి చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు వార్డు ప్రజలు, మహిళలు హారతులతో వీరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నాయకులు ప్రసంగించారు.

​ఎంపీ చింతకాయల విజయ్ మాట్లాడుతూ...
పినారిపాలెం లోని ప్రజలు తమ సొంత కుటుంబం లాంటి వారిని, ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించడం ఆనవాయితీ అని చింతకాయల విజయ్ తెలిపారు. రానున్న మూడు సంవత్సరాలు రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వమే ఉంటుందని, అందువల్ల అభివృద్ధి కోసం పద్మావతికి, ఇతర కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని ఆయన కోరారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం రోడ్లు వేయలేదని, వారి ప్రభుత్వం లో బోర్లు కు రిబ్బన్ కత్తిరించారని  విమర్శించారు. పినారిపాలెంలో మంచి పార్కుతో పాటు కళ్యాణ మండపం కూడా నిర్మిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  

​చైర్‌పర్సన్ అభ్యర్థి చింతకాయల పద్మావతి మాట్లాడుతూ...కరోనా కష్టకాలంలో ప్రజలకు మాస్కులు, కూరగాయలు అందిస్తూ లాలం మురళి ఎంతో సేవ చేశారని చింతకాయల పద్మావతి గుర్తుచేశారు. మున్సిపాలిటీలో మంచి మెజారిటీతో అభ్యర్థులను గెలిపిస్తే, స్వచ్ఛమైన నర్సీపట్నంగా తీర్చిదిద్ది అభివృద్ధి చేసి చూపిస్తామని ఆమె హామీ ఇచ్చారు.  
​1వ వార్డు అభ్యర్థి లాలం మురళీకృష్ణ మాట్లాడుతూ... పద్మావతి గారు ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి వరకు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కష్టపడుతున్నారని లాలం మురళీకృష్ణ తెలిపారు. ఎంపీ విజయ్ చొరవతో పెద్ద చెరువులో 108 అడుగుల సృష్టి క్షేత్రం  రావడం నర్సీపట్నం ప్రజల అదృష్టమని ఆయన కొనియాడారు. కూటమి అభ్యర్థులకు సైకిల్ గుర్తుపై ఓటు వేసి కేవలం గెలుపు మాత్రమే కాకుండా అత్యధిక మెజారిటీని అందించాలని ఆయన ప్రజలను కోరారు.  
​ఈ కార్యక్రమంలో వార్డు సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యువత మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.