BREAKING
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి విజయదశమి వేళ రాజరాజేశ్వరీ దేవిగా దుర్గమ్మ దర్శనం విజయవాడలో కూటమి సమష్టి కార్యాచరణ.. - అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు ప్రత్యేక వ్యూహం మహర్నవమి వేడుకల్లో ఆయుధ పూజలు.. - పోలీస్‌ కమిషనర్‌ దంపతుల ప్రత్యేక పూజలు 76వ డివిజన్‌లో గాదిరాజు శ్రీనివాసరాజుకు మద్దతుగా బొండా ఉమా ప్రచారం కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నగారా ఉయ్యూరు అభివృద్ధే లక్ష్యం.. ప్రజా సంక్షేమమే ధ్యేయం మచిలీపట్నం అభివృద్ధే నా ధ్యేయం : కూటమి మేయర్ అభ్యర్థి షేక్ అబ్దుల్ అబీదా స్థానిక ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి స్థానిక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ దసరా మెగా కార్నివాల్‌.. విజయవాడలో ట్రాఫిక్‌ మళ్లింపులు విజయవాడ ఉత్సవ్ 2.0లో ‘క్యాస్ట్’ చిత్ర బృందం సందడి నేటి పంచాంగం 20 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –20 అక్టోబర్ 2026 శ్రీవారి అలంకరణలో కదిరి నరసింహ స్వామి

మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థిగా అల్లారెడ్డి ఇందుమతి

Select Suryaa Now
మున్సిపల్ చైర్ పర్సన్ వైసీపీ అభ్యర్థిగా అల్లారెడ్డి ఇందుమతి

ఆత్మకూరు, మేజర్ న్యూస్ :
ఆత్మకూరు మున్సిపాలిటీకి జరుగునున్న ఎన్నికల్లో చైర్ పర్సన్ అభ్యర్థిగా వైసీపీ తరఫున అల్లా రెడ్డి ఇందుమతి ఎంపికై శనివారం ఒక నామినేషన్ దాఖలు చేయగా ఆదివారం ఆమెను అభ్యర్థిగా నిర్ణయించి బలపరిచిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి జిల్లా వైసీపీ ఉపాధ్యక్షుడు డాక్టర్ చిల్లూరు ఆదిశేషయ్య, వైసీపీ మున్సిపల్ విభాగం రాష్ట్ర కార్యదర్శి అల్లా రెడ్డి ఆనంద రెడ్డి,పట్టణ వైసీపీ అధ్యక్షులు నాగులపాటి ప్రతాపరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో రెండవ నామినేషన్ కూడా దాఖలు చేశారు.తొలి రోజు ఆమె నామినేషన్ కార్యక్రమంలో మేకపాటి విక్రమ్ రెడ్డి తో పాటు మాజీ జెడ్పీ చైర్మన్, మాజీ శాసన మండల సభ్యులు వైసిపి నాయకులు బొమ్మిరెడ్డి రాఘవేందర్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆనంద రెడ్డి సతీమణి అయిన ఇందుమతి మాజీ మండల అధ్యక్షుడు మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లారెడ్డి కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అల్లారెడ్డి అనసూయమ్మ ల కోడలు. ఆ కుటుంబం రాజకీయంగా గత 40 సంవత్సరాలుగా ఉండడంతో పలు వర్గాల్లో ఆదరణ లభిస్తుందని భావిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రం రెడ్డి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావించి విజయం కోసం ప్రచారం నిర్వహించనున్నారు.