మేడ్చల్ డిపోలో ఉత్సాహంగా ఎన్నికలు
632 ఓట్లకు గాను ఇప్పటివరకు 153 ఓట్లు నమోదు
మేడ్చల్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 9:) తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మేడ్చల్ డిపోలో ఎన్నికల పోలింగ్ ఉత్సాహంగా కొనసాగుతోంది. డిపోకు చెందిన ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.మేడ్చల్ డిపోలో మొత్తం 632 ఓట్లు ఉండగా, ఇప్పటివరకు 153 ఓట్లు పోలయ్యాయి. దీంతో 24.21 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుండగా, ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. రానున్న గంటల్లో పోలింగ్ శాతం మరింత పెరిగే అవకాశం ఉంది.
రిపోర్టర్: తలారి శివకుమార్, మేడ్చల్.